Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- కార్యకర్తల పేరిట అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు
- మల్లయ్య కొండ, సాధు కొండల్లో మైనింగ్ జోలికి రావొద్దు
- ఈ నెల 12 వరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్య కొండ, సాధు కొండల్లో మైనింగ్ జోలికొస్తే.. చావడానికైనా, చంపడానికైనా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తంబళ్లపల్లి పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మల్లయ్య కొండ, సాధు కొండలపై మైనింగ్ మాఫియా కన్ను పడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆధ్యాత్మిక కేంద్రాలను మైనింగ్ పేరిట ధ్వంసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వాటి జోలికి వస్తే చావడానికైనా, చంపడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి ఈ మైనింగ్ దోపిడీని అడ్డుకోవాలని.. కూటమి నాయకులు సహకరించకపోయినా ఈ ప్రజా ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే తమపై బురదజల్లుతున్నారని, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేకపోయారని కూటమి సర్కార్‌ను డిమాండ్ చేశారు. తాము తప్పు చేసినట్లు నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులను అడ్డం పెట్టుకుని, విలువైన 22A భూములను కూటమి కార్యకర్తల పేరిట అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఈ భూదోపిడీ మొత్తం బయటకు తీసి, క్షేత్రస్థాయిలో కఠిన విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే సీఎం చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!