ఇటీవలి కాలంలో తమన్నా ఎంపిక చేస్తున్న పాత్రలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఓదెల రైల్వే స్టేషన్ 2లో శక్తివంతమైన పాత్రతో, అలాగే అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2లో కీలక క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఓ బయోపిక్ ద్వారా మరో విభిన్నమైన, భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించబోతుంది ఈ మిల్క్ బ్యూటీ.
Also Read : Nani: నాని నుండి మరో సర్ప్రైజ్..
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వీ. శాంతారాం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘చిత్రపతి వీ. శాంతారాం’. యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది శాంతారాం పాత్రలో కనిపించనున్నాడు. నాటసామ్రాట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ బయోపిక్‌లో నటి తమన్నా ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాలో ఆమె, శాంతారాం గారి భార్య సాంధ్య పాత్రలో నటించనున్నట్టు సమాచారం. కథ విన్న వెంటనే తమన్నా కూడా ఈ పాత్రను అంగీకరించినట్లు సమాచారం. చిత్రబృందం ప్రస్తుతం షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. వీ. శాంతారాం జీవితం, ఆయన చేసిన ప్రయోగాలు, భారతీయ సినిమాకి అందించిన సేవలను నిజమైన రూపంలో చూపించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాలీవుడ్‌లో మరో సక్సెస్‌ఫుల్ బయోపిక్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమలో ఇప్పటికే చర్చ మొదలైంది. తమన్నా ఈ పాత్రలో ఎలా మెరిసుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.