Tamannaah: మంచు మనోజ్ సినిమాతో శ్రీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అప్పుడు కలర్ తప్ప ఏం లేదు ఈవిడేం హీరోయిన్ అనుకున్నారు అంతా.. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తర్వాత ఆవారాతో హిట్ కొట్టింది. అంతే బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అందరి చేత ముద్దుగా మిల్కీ బ్యూటీ అనిపించుకుని.. హీరోయిన్ అంటే తమన్నా అనేలా తన వైపుకు అందరినీ తిప్పుకుంది. ప్రస్తుతం భారీ సినిమాలతో ఇండస్ట్రీని ఏలేస్తుంది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన లస్ట్ స్టోరీలో బోల్డ్ సీన్లతో ఎంతోమంది కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం తమన్నా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ దుమ్ము దులిపేస్తోంది.
Read Also:Post Office TD vs SBI FD: పోస్ట్ ఆఫీస్ టీడీ – ఎస్బీఐ ఎఫ్డీ ఏది బెస్ట్?
మిల్కీ బ్యూటీ తాజాగా రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి `భోళా శంకర్`. రెండు సినిమాల్లోనూ తమన్నా నటించింది. ఒకేసారి రెండు ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజాలు నటించిన చిత్రాలతో అలరించింది. ఫస్ట్ షోనుంచే జైలర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కానీ టాలీవుడ్లో మాత్రం భోళాశంకర్ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఇటీవల తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె చాలా ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తనకున్న బాండింగ్ ను వెల్లడించింది. వీరిద్దరూ కలిసి రచ్చ సినిమాలో నటించారు. ఇద్దరూ కలిసి చేసింది ఒకే సినిమా అయినా వారి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. తను ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉన్నా, మూడ్ బాగోలేకపోయినా తమ్ము బేబి ఫస్ట్ కాల్ చరణ్ కే చేస్తుందట. చరణ్ తాను ఎంత బిజీగా ఉన్నా తమన్నా ఫోన్ వెంటనే లిఫ్ట్ చేస్తాడట. చాలా కూల్ గా మాట్లాడుతూ.. లైఫ్ కి సంబంధించి ఎన్నో సలహాలు, సూచనాలు ఇస్తాడట చరణ్… తనతో మాట్లాడుతుంటే టైం తెలియదని ఒత్తిడంతా ఒక్క క్షణంలోనే పోతుందని తమన్నా పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ కాజల్ అని తమన్నా ఇప్పటికే ఎన్నో సార్లు తెలిపింది.
Read Also:Elon Musk: కొడుకుతో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్.. ఫోటో షేర్ చేసిన మస్క్