Talking in Sleep: చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే దీనిని లైట్ తీసుకుంటూ ఉంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద సమస్యలకే దారి తీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీనిని పైరాసోమ్నియా అని అంటారు. దీనినే డ్రీమ్ డిజార్డర్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే ఏం ఫర్వాలేదు కానీ తరుచుగా జరిగితే మీరు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ఇది సమస్యగా మారవచ్చు. పనిలో ఒత్తిడి ఉన్నప్పుడు సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. దీని వల్ల మీరు మాత్రమే కాకుండా మీ పక్కవారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు నిద్రలో కలవరిస్తున్నారు అంటే మీరు కలత నిద్రలో ఉన్నారని, మీకు సరిగా నిద్రపట్టడం లేదని అర్థం.
Also Read: Disha Patani : తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించిన దిశా పటాని.. వైరల్ అవుతున్న పిక్స్..
ఈ సమస్య ఎక్కువగా పిల్లలలో చూస్తూ ఉంటాం. అయితే మారిన జీవన విధానంతో పెద్దవారిలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాఢనిద్రలో ఉన్నట్లు కనిపిస్తున్నా ఏవేవో మాట్లాడుతుంటారు. అంతేకాదు వారు ఏం మాట్లాడారో తరువాత వారికి గుర్తుండదు. ఇది సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల జరుగుతుంది. ఇలాంటి సమస్యకు ప్రధాన కారణం ఒత్తిడి. ఇటీవల కాలంలో పని ఒత్తిడి ఎక్కువ అయిపోయింది. దాంతో శారీరం అలసిపోతుంది. బ్రెయిన్ రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటుంది. అయితే నిద్రపోదామంటే ఏవో అలోచనలతో సరిగా నిద్రపట్టదు. దీంతో నిద్రపోతున్నా బ్రెయిన్ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దీని కారణంగా నిద్రలో చాలా మంది పైకి మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్వరం లేదా ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అలసిపోతుంది. అటువంటి సమయంలో కూడా నిద్ర సరిగా పట్టక కలవరిస్తూ ఉంటాం. ఇలా శరీరం అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. ఇది కొన్ని సార్లు డిప్రెషన్ తో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఈ సమస్య ఎక్కువ అయితే డిప్రెషన్ కూడా కలుగవచ్చు. ఈ సమస్యను సహజంగా కూడా తగ్గించుకోవచ్చు. దాని కోసం ప్రతి రోజు తప్పని సరిగా 7 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోవాలి. నిద్రలేమి లేకుండా చూసుకుంటే ఈ సమస్య దాదాపు తగ్గిపోతుంది. ఒత్తిడిని తగ్గించే యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. నిద్రపోయే ముందు మంచి విషయాలను, పాజిటివ్ గా అనిపించే వాటి గురించే ఆలోచించాలి. ఇలా చేస్తే చాలా వరకు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.