హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని రామ్‌గోపాల్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 22 ఫైర్ ఇంజన్లతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ భవనమే కాకుండా పక్కనే ఉన్న భవనం స్లాబ్ కూలింది. అయితే.. ప్రమాదం జరిగిన భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు గుర్తించడంతో దాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రేపు ఉదయం భవనాన్ని కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించామన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం అందుతుందని, అన్ని ఫైర్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ప్రయత్నం చేశాయన్నారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ వలన బస్తి వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందులో కెమికల్స్ ఉండడం వల్ల ఈ స్థాయిలో నష్టం జరిగి జరిగిందని ఆయన వెల్లడించారు.
Also Read : Off The Record: బీఆర్ఎస్ సభ అక్కడే ఎందుకు?
బిల్డింగ్ వెనకాల ఉన్న ఇండ్లలోని వ్యక్తులను ఖాళీ చేయించామని, మధ్యాహ్నం రాత్రి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే గురువారం లేదా శుక్రవారం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని, హైదరాబాద్ రోజు రోజుకి భారీగా విస్తరిస్తుందన్నారు. ఇచ్చిన అనుమతులకు విరుద్దంగా అక్రమంగా ఆక్రమించుకొని కట్టడాలు కట్టారన్నారు. చాలా బిల్డింగ్‌లకు ఎన్‌ఓసీలు సైతం లేవు అలాంటి వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జనావాసాల మధ్య ఇలాంటి లేకుండా దూరంగా ఉంటే ఎలా ఉంటుందని దానిపైన కూడా చర్చ చేస్తామన్నారు. నాలలాల పైన కూడా అక్రమనలు వచ్చాయని, వాటిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Also Read : Minister KTR : 150 కోట్లతో హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్