Off The Record: బీఆర్ఎస్ సభ అక్కడే ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముగ్గురు సీఎంలను తీసుకొచ్చి ఖమ్మం సభ సక్సెస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి వ్యూహం ఏంటి? పొరుగున ఉన్న ఏపీనే BRS టార్గెట్టా? విశాఖలో KCR సభ ప్రకటించడానికి ప్రత్యేక కారణం ఉందా?
Also Read
ఏపీలోనూ ఖమ్మం బీఆర్‌ఎస్ సభ ప్రభావం..!
బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి బహిరంగసభను ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలోనే. మొదట ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ఈ సభను ఖమ్మానికి మార్చుకుంది. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంల సమక్షంలో ఇక్కడే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముగ్గురు సీఎంలతోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, CPI ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా ఈ సమావేశానికి హాజరుకావడంతో దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ దృష్టిని ఆకర్షించింది. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా తామంతా ఒకటే అనే సంకేతం ఇచ్చింది అధికారపార్టీ.
విశాఖలో తదుపరి బీఆర్‌ఎస్ బహిరంగ సభ..!
ఖమ్మం తర్వాత నెక్ట్స్ బహిరంగసభ ఆంధ్రప్రదేశ్‌లోనే అని బీఆర్‌ఎస్ ప్రకటించింది. అదీకూడా ప్రతిపాదిత ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖలో సీఎం కేసీఆర్ సభ ఉంటుందని చెబుతోంది. త్వరలోనే సభ తేదీని ఫైనల్ చేయనుంది. బయటి రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ ఏపీ మినహా ఎక్కడా రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించలేదు. ఏపీకి అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు రిటైర్డ్ సివిల్ సర్వెంట్లను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ నిర్వహించబోయే సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
విశాఖ సభకు ఎవరెవరిని ఆహ్వానిస్తారు?
విశాఖలో బీఆర్‌ఎస్ సభకు సీఎం కేసీఆర్ ఎవరెవరిని ఆహ్వానిస్తారనేది ఉత్కంఠగా మారింది. 175 సీట్లలో పోటీ చేస్తామని చెబుతున్న ఆ పార్టీ.. ఏపీలో వేయబోతున్న అడుగులను అన్ని పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఏపీలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలైన వైసీపీ, టిడిపి, బిజెపి, జనసేనతో సంబంధం లేకుండా కేసీఆర్ సభను నిర్వహించబోతున్నారు. అలాగే ఏపీలో మూడు రాజధానులపై గులాబీ బాస్ ఏం చెబుతారు? ఏపీలోని అధికార వైసీపీని టార్గెట్ చేస్తారా? అనేది చూడాలి.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!