NTV Telugu Site icon

KTR: రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తున్నది

Ed Ktr

Ed Ktr

KTR: కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తున్నదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్ల స్కామ్ నుంచి మొదలుకొని సివిల్ సప్లైస్ స్కామ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్కామ్ లకు పాల్పడుతున్నా కాపాడుతున్నదని ఆయన మండిపడ్డారు. సాక్ష్యాదారాలతో సహా అనేకసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసిన మౌనం వహిస్తున్నదన్నారు కేటీఆర్‌. గతంలో కాలేశ్వరం ప్రమాదంపైన అఘామేగాలపై స్పందించిన కేంద్రం… మెన్న సుంకిశాల ప్రమాదం పైన కానీ, నేడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ను కాపాడుతున్నదన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందని ఆయన అన్నారు. సరైన సమయంలో రేవంత్ బీజేపీలో చేరతానని హమీ ఇవ్వడం వల్లనే కేంద్రం అయనను కాపాడుతుందన్న అనుమానం ఉందన్నారు కేటీఆర్‌