NTV Telugu Site icon

Gangula Kamalakar : కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు

Gangula Kamalakar

Gangula Kamalakar

Gangula Kamalakar : నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం పెట్టి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, గతంలో జిల్లా పరిషత్ లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంచార్జీ మంత్రి కంట్రోల్ చేసేవారన్నారు. నిన్న జరిగిన ఘటనలో ముగ్గురు మంత్రులు ఉండి జరిగిన ఘటనను కంట్రోల్ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు.

 
Trinadha Rao: నోటి దురద కామెంట్స్.. చిక్కుల్లో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు?
 

ఏ సమావేశంలో కూడా ఎమ్మెల్యేలపై పోలీసులు ఇలా దాడి చేయలేదని, వారి ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగిన సంభాషణలో ఏం జరిగింది తెలుసుకోకుండా లాక్కుపోవడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అధికారులతో అక్రమ కేసులు పెట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేశారని, కరీంనగర్ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు బలం ఉందని ఎదురిస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. మంత్రుల అనుమతులు లేకుండానే పోలీసులు వేదిక మీదకు వచ్చారా అని ఆయన అన్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన దళిత బంధు విషయం పై ప్రశ్నించడం జరిగిందని, అక్రమ కేసులకు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు.

Pakistan : మూడేళ్లలో అద్భుతాలను సృష్టించనున్న పాకిస్తాన్.. ఇంతకు అసలు సంగతి ఏంటంటే ?

Show comments