గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. "మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం" అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పోలీసుశాఖతో పెట్టుకోవద్దు.. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే…
Gangula Kamalakar : నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం…
Election commission: రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుకు అన్ని ఎర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం కౌంటింగ్ కేంద్రాలు దగ్గర 144 సెక్షన్ అమలు చేసారు. మరి ముఖ్యంగా ఏపీ లో అయితే రికార్డ్ స్థాయి లో కేంద్ర బలగాలు ఏర్పాటు చేసారు. అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.. ఒకవేల ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల…
ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపునకు మావోయిస్టుల నుంచి జవాబు వచ్చింది. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని అయితే అందుకు తమకు కూడా కొన్ని ముందస్తు షరతులున్నాయని సీపీఐ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు. వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం….…
ఆకురాలే కాలం అన్నలకు గడ్డుకాలం అంటారు. అలాంటి కాలంలో ఎక్కడా మావోల మొలకలు పడకుండా పోలీసులు ముందు జాగ్రత్త పడుతున్నారు. మాజీలను అలెర్ట్ చేయడంతోపాటు యూజీలను జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు యువత అటు వైపు వెళ్ళకుండా దారి మళ్ళించే పనిలో పడ్డారు ఖాకీలు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ప్లాన్ ఏంటి? మారుమూల, మావోయిస్టు గ్రామాలపై ఫోకస్ ఎందుకు పెడుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల మారుమూల గ్రామాలపై పోలీసులు కన్నేసారు. మరీ ముఖ్యంగా గతంలో…