Rainbow Children Hospital : పిల్లల ఆరోగ్యం మరియు సంరక్షణ పట్ల పిడియాట్రిక్ సర్జన్లు నిర్వహించు పాత్ర అత్యంత కీలకమైనది. పిల్లల శస్త్రచికిత్స వైద్యులు నిర్వహించు ఈ పనితనమునకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తేదీని నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నాది. ఈ ఏడాది రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, విశాఖపట్నం వారు పుట్టుకతో వచ్చిన లోపాలను సంక్లిష్టమైన శస్త్రచికిత్సల ద్వారా విజయవంతంగా సవరించుకున్న 15 మందికి పైగా పిల్లలను సత్కరించింది. భారతదేశంలో పుట్టుకతో సంభవించు లోపాలు కారణంగా శిశు మరణాల రేటు 10-20% ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పుట్టుకతో వచ్చే లోపాలను శస్త్రచికిత్స ద్వారా సవరించి ఈ శిశు మరణాల రేటును తగ్గించుటలో పీడియాట్రిక్ సర్జన్లు నిర్వహించు పాత్ర అత్యంత కీలకం. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రతిభావంతులు అనుభవజ్ఞులైన పిడియాట్రిక్ సర్జన్లను మరియు అత్యాధునిక వైద్య పరికరాలను కలిగి నవజాత శిశువులు మరియు పిల్లలకు సంబంధించిన అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తుంది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, విశాఖపట్నం పీడియాట్రిక్ మరియు నియోనాటల్ సంరక్షణలో అగ్రగామి.
జాతీయ పీడియాట్రిక్ సర్జన్ల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవం ప్రధానాంశం “ పిల్లల మూత్ర సంబంధిత వ్యాధులకు పీడియాట్రిక్ సర్జన్లును సంప్రదించడం “ పట్ల ప్రజలకు అవగాహన కల్పించటం. ఈ సందర్భంగా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, విశాఖపట్నం యూరాలజీ స్పెషలిస్ట్ & ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కన్సల్టెంట్-పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ రావి హిమజ మాట్లాడుతూ, మా వద్ద అత్యాధునిక మౌలిక సదుపాయాలు, నిపుణులైన వైద్య బృందం ఉన్నందున నెలలు నిండకుండా పుట్టిన నవజాత శిశువులకు మరియు పిల్లలకు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించాము. పిల్లల సంరక్షణకు పీడియాట్రిక్ సర్జరీ కీలకమైనది మరియు విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారు పిల్లల అత్యాధునిక వైద్యచికిత్సల కోసం సుదూర నగరాలకు వెళ్లనవసరం లేదు. మా హాస్పిటల్ నందు 27 వారాలకే నెలలు నిండకుండా జన్మించిన శిశువుకు మరియు 850 గ్రాముల బరువు కలిగిన పేగులోని రంద్రాలకు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించాము మరియు పుట్టుకతో ఊపిరితిత్తుల వ్యాధితో పుట్టిన 3 నెలల శిశువుకు అధునాతన ప్రక్రియతో చికిత్స చేసాము. పుట్టుకతో పిల్లలలో వచ్చే లోపం లేదా మూత్ర విసర్జన సమస్య ఉంటే పీడియాట్రిక్ సర్జన్‌ని తప్పక సంప్రదించాలని ఆమె అన్నారు. ప్రపంచ-స్థాయి మౌలిక సదుపాయాలు మరియు ప్రతిభావంతులైన వైద్య బృందంతో ఎల్లప్పుడూ చిన్న పిల్లలకు అత్యుత్తమ చికిత్స అందించుటకు రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కట్టుబడి ఉంది అన్నారు. సమాచారం కోసం దయచేసి సంప్రదించండి: 97059 16789