NTV Telugu Site icon

Instagram Love : యువతి కొంపముంచిన ఇన్ స్టాగ్రామ్ పరిచయం

Insta Love

Insta Love

Instagram Love : ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి కొంపముంచింది. బెంగళూరులో ఇన్ స్టాలో ప్రేమ పేరుతో రూబియా(22)కు మహారాష్ట్రకి చెందిన మన్వర్(28) పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 8 నెలల పాటు బెంగళూరులో యువతితో మన్వర్ సహజీవనం చేశాడు. అయితే.. 10 రోజుల క్రితం బెంగళూరులో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న మన్వర్ తల్లితండ్రుల వద్దకి వచ్చారు జంట. మన్వర్ తల్లిదండ్రులు ఒప్పుకోకొకపోవడంతో ఇంట్లో గొడవ జరిగింది. భర్త మన్వర్ కూడా తల్లిదండ్రులకు సపోర్ట్ గా మాట్లాడటంతో మనస్తాపంతో యువతి నిద్ర మాత్రలు మింగింది. దీంతో… వెంటనే బైక్‌పై యువతిని ఎక్కించుకొని సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద యువతిని విడిచిపెట్టి పరారయ్యాడు మన్వర్. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

MPs Cricket Match: రాజ్యసభ ఛైర్మన్ XI, లోక్‌సభ స్పీకర్ XI మధ్య మ్యాచ్.. సెంచరీతో రెచ్చిపోయిన అనురాగ్ ఠాకూర్

Show comments