NTV Telugu Site icon

Tapsee : అలాంటి మాట‌లతో ప్రతీ రోజు పోరాటమే చేస్తున్న : తాప్సీ

Taapsee Pannu

Taapsee Pannu

Tapsee : ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.. తన అందచందాలతో బాగానే ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. దీంతో తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి నేటి వరకు అక్కడే సెటిల్ అయిపోయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమను పూర్తిగా వదిలేసింది. కెరీర్ ని అక్కడే నిర్దేశించుకుని తన ప్రయాణం కొనసాగిస్తోంది. హీరోయిన్ గా కొన‌సాగుతూనే సొంతంగా సినిమాలు కూడా నిర్మిస్తుంది. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాలు చేస్తోంది. అయితే అక్కడా తాప్సీ కెరీర్ టాలీవుడ్ త‌ర‌హాలోనే సాగుతుంది. స‌రైన హిట్లు ప‌డ‌డం లేదు. తాప్సీ క‌న్నా వెన‌కెళ్లిన భామ‌లు స‌క్సెస్ అవుతున్నారు గానీ…తాప్సీ కి మాత్రం స‌రైన బ్రేక్ రావ‌డం లేదు.

Read Also:Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు..

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పారితోషికం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. `సినిమాల్లో చాలా కాలంగా కొన‌సాగుతున్నా. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులను అల‌రించాల‌ని కోరుకుంటున్నా. పారితోషికం విష‌యంలో న‌టుల మ‌ధ్య వ్యత్యాసం ఉంటుంది అన్నది అంద‌రికీ తెలిసిందే. `జుడ్వా-2`, `డంకీ` చిత్రాల్లో న‌టించినందుకు గానే నేను భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నానని అనుకుంటున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. సినీ ప‌రిశ్రమలో హీరోయిన్లను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చూస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది? అన్నట్లు కొంత మంది వ్యవహ‌రిస్తారు. మ‌రికొంత మంది మేము మంచి ప్రాజెక్ట్ ల్లో అవ‌కాశం క‌ల్పించి కెరీర్ కి స‌హాయం చేస్తున్నాం. డ‌బ్బుదేముందని అంటారు. ఇలాంటి మాటలపై ఇండ‌స్ట్రీ లో ప్రతిరోజూ పోరాటం చేస్తూనే ఉన్నా.

Read Also:Pakistan: భారత్ వల్లే లాహోర్లో కాలుష్యం.. పాక్ వింత వాదన

త‌మ సినిమాలో హీరోయిన్ గా ఎవ‌రు న‌టించాల‌న్నది అందులో న‌టించే హీరోనే నిర్ణయిస్తాడు. కొంత మంది హీరోలు ట్రెండింగ్ లో ఉన్న వారిని తీసుకుంటారు. మ‌రికొంత మంది త‌మ‌ని డామినేట్ చేయ‌ని వాళ్లను సెలక్ట్ చేసుకుంటారు.` అని అంది. తాప్సీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. తాప్సీ కూడా కొంత కాలంగా ఎంతో ఓపెన్ గా మాట్లాడుతుంది.

Show comments