Tapsee : అలాంటి మాటలతో ప్రతీ రోజు పోరాటమే చేస్తున్న : తాప్సీ
- బాలీవుడ్ కే పరిమితం అయిన తాప్సీ
- అంత రెమ్యునరేషన్ తీసుకున్నానన్న దాంట్లో నిజం లేదు
- కొంతమంది అలాంటి వాళ్లనే తీసుకుంటారు
- వైరల్ గా తాప్సీ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tapsee : ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ.. తన అందచందాలతో బాగానే ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. దీంతో తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన నాటి నుంచి నేటి వరకు అక్కడే సెటిల్ అయిపోయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమను పూర్తిగా వదిలేసింది. కెరీర్ ని అక్కడే నిర్దేశించుకుని తన ప్రయాణం కొనసాగిస్తోంది. హీరోయిన్ గా కొనసాగుతూనే సొంతంగా సినిమాలు కూడా నిర్మిస్తుంది. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పరిమిత బడ్జెట్ సినిమాలు చేస్తోంది. అయితే అక్కడా తాప్సీ కెరీర్ టాలీవుడ్ తరహాలోనే సాగుతుంది. సరైన హిట్లు పడడం లేదు. తాప్సీ కన్నా వెనకెళ్లిన భామలు సక్సెస్ అవుతున్నారు గానీ…తాప్సీ కి మాత్రం సరైన బ్రేక్ రావడం లేదు.
Read Also:Hyderabad Metro: మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు..
Also Read
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `సినిమాల్లో చాలా కాలంగా కొనసాగుతున్నా. వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నా. పారితోషికం విషయంలో నటుల మధ్య వ్యత్యాసం ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. `జుడ్వా-2`, `డంకీ` చిత్రాల్లో నటించినందుకు గానే నేను భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నానని అనుకుంటున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. సినీ పరిశ్రమలో హీరోయిన్లను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చూస్తారు. మా సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు. వేరే వాళ్లను ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నట్లు కొంత మంది వ్యవహరిస్తారు. మరికొంత మంది మేము మంచి ప్రాజెక్ట్ ల్లో అవకాశం కల్పించి కెరీర్ కి సహాయం చేస్తున్నాం. డబ్బుదేముందని అంటారు. ఇలాంటి మాటలపై ఇండస్ట్రీ లో ప్రతిరోజూ పోరాటం చేస్తూనే ఉన్నా.
Read Also:Pakistan: భారత్ వల్లే లాహోర్లో కాలుష్యం.. పాక్ వింత వాదన
తమ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించాలన్నది అందులో నటించే హీరోనే నిర్ణయిస్తాడు. కొంత మంది హీరోలు ట్రెండింగ్ లో ఉన్న వారిని తీసుకుంటారు. మరికొంత మంది తమని డామినేట్ చేయని వాళ్లను సెలక్ట్ చేసుకుంటారు.` అని అంది. తాప్సీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తాప్సీ కూడా కొంత కాలంగా ఎంతో ఓపెన్ గా మాట్లాడుతుంది.
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!