Site icon NTV Telugu

T20 World Cup Controversy: “థాంక్యూ పాకిస్థాన్”.. పాక్ నిర్ణయంపై బంగ్లాదేశ్ రియాక్షన్..

Pakistan Bangladesh

Pakistan Bangladesh

T20 World Cup Controversy: మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే పాల్గొనే జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. టీమిండియా సైతం ఎలాగైనా టైటిల్ సాధించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్థాన్ టీం నాటకీయ పరిస్థితి ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమకు సపోర్టుగా నిలిచిన పాకిస్థాన్‌ నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది. బంగ్లాదేశ్ యువజన, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించిన నిర్ణయానికి నిరసనగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించడాన్ని పాకిస్థాన్ ప్రకటించడం ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఆసిఫ్ నజ్రుల్.. “థాంక్యూ పాకిస్థాన్” అని రాసుకొచ్చారు. షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.

READ MORE: MVSP Collections: అల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ జోరు మాములుగా లేదుగా!

ఇదిలా ఉండగా.. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్థాన్ కేబినెట్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించడం సరికాదని, అందుకు నిరసనగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని స్పష్టం చేశారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని, బంగ్లాదేశ్‌కు పూర్తిగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇది చాలా ఆలోచించి తీసుకున్న సరైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ జట్టు ఆడబోదని వెల్లడించింది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, కానీ ఈ తరహా ఎంపిక చేసుకుని మ్యాచ్‌లు ఆడకపోవడం ప్రపంచస్థాయి టోర్నమెంట్ ఆత్మకు విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. అర్హత సాధించిన ప్రతి జట్టు షెడ్యూల్ ప్రకారం సమానంగా పోటీ పడాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలాంటి నిర్ణయాలు పాకిస్థాన్ క్రికెట్‌కే కాకుండా, మొత్తం అంతర్జాతీయ క్రికెట్ వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముందని ఐసీసీ హెచ్చరించింది. ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించింది.

READ MORE: CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ.. ఎవరిని వదిలేది లేదు..!

Exit mobile version