T20 World Cup Controversy: “థాంక్యూ పాకిస్థాన్”.. పాక్ నిర్ణయంపై బంగ్లాదేశ్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup Controversy: మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే పాల్గొనే జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. టీమిండియా సైతం ఎలాగైనా టైటిల్ సాధించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్థాన్ టీం నాటకీయ పరిస్థితి ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమకు సపోర్టుగా నిలిచిన పాకిస్థాన్ నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది. బంగ్లాదేశ్ యువజన, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించిన నిర్ణయానికి నిరసనగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించడాన్ని పాకిస్థాన్ ప్రకటించడం ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం ఫేస్బుక్లో పోస్టు చేసిన ఆసిఫ్ నజ్రుల్.. “థాంక్యూ పాకిస్థాన్” అని రాసుకొచ్చారు. షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.
READ MORE: MVSP Collections: అల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ జోరు మాములుగా లేదుగా!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇదిలా ఉండగా.. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్థాన్ కేబినెట్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించడం సరికాదని, అందుకు నిరసనగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని స్పష్టం చేశారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని, బంగ్లాదేశ్‌కు పూర్తిగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇది చాలా ఆలోచించి తీసుకున్న సరైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ జట్టు ఆడబోదని వెల్లడించింది. ఈ పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, కానీ ఈ తరహా ఎంపిక చేసుకుని మ్యాచ్‌లు ఆడకపోవడం ప్రపంచస్థాయి టోర్నమెంట్ ఆత్మకు విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. అర్హత సాధించిన ప్రతి జట్టు షెడ్యూల్ ప్రకారం సమానంగా పోటీ పడాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలాంటి నిర్ణయాలు పాకిస్థాన్ క్రికెట్‌కే కాకుండా, మొత్తం అంతర్జాతీయ క్రికెట్ వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముందని ఐసీసీ హెచ్చరించింది. ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించింది.
READ MORE: CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ.. ఎవరిని వదిలేది లేదు..!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..