India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Zimbabwe: ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి ‘చావు-రేవు’ అన్నట్టుగా తయారైంది. ముఖ్యంగా ఈరోజు (ఫిబ్రవరి 26, గురువారం) జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ భారత జట్టు భవిష్యత్తును మాత్రమే కాదు, నలుగురు స్టార్ ఆటగాళ్ల కెరీర్‌ను కూడా నిర్ణయించబోతోంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో భారత్ గెలవడమే కాదు, సౌత్ ఆఫ్రికా – వెస్టిండీస్‌ను ఓడించాలి. ఎందుకంటే వెస్టిండీస్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. వెస్టిండీస్ వాళ్లు గెలిస్తే మన జట్టు సెమీస్ చేరడం దాదాపు అసాధ్యం.
READ ALSO: Viral Video: ఆలయ ఉత్సవంలో ‘ఏనుగు’కు ఆగ్రహం.. తొండంతో పూజారిని అంతదూరం..!
Also Read
ప్రమాదంలో ఉన్న ఆ నలుగురు స్టార్లు వీరే:
అభిషేక్ శర్మ: ఈ స్టార్ ప్లేయర్ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా ఉన్నా, ఈ వరల్డ్ కప్‌లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 4 మ్యాచ్‌ల్లో కలిపి చేసింది కేవలం 15 పరుగులు మాత్రమే. ఇందులో మూడు సార్లు సున్నాకే అవుటయ్యాడు. ఇదే ఫామ్ కొనసాగితే మనోడి స్థానంలో యశస్వి జైస్వాల్ లేదా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తిలక్ వర్మ: కీలకమైన మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ, ఆశించిన స్థాయిలో వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 107 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. మనోడి ఫామ్ ఇలాగే కొనసాగితే..తిలక్ ప్లేస్‌ను రీప్లే్స్ చేయడానికి శ్రేయాస్ అయ్యర్ రెడీగా ఉన్నాడు.
రింకు సింగ్: ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్‌కు ఈ టోర్నీలో బ్యాటింగ్ చేసే అవకాశం తక్కువగా వచ్చినా, మనోడు మాత్రం తనకు అడపాదడపా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 5 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 24 పరుగులే చేశాడు. దీంతో రింకు స్థానంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్): జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ సూర్య ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఆయన సగటు బాగున్నా, తన మార్కు ‘మెరుపు వేగం’ (స్ట్రైక్ రేట్) తగ్గింది. సూర్యకు ఇప్పుడు 35 ఏళ్లు. ఒకవేళ భారత్ సెమీస్ చేరకుండానే వెనుదిరిగితే, కెప్టెన్సీతో పాటు ఆయన కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే చెన్నై వేదికగా ఈ రోజు జరిగే మ్యాచ్ టీమిండియాకు అగ్నిపరీక్ష లాంటిది. ఇందులో గెలిచి సెమీస్ చేరితేనే ఈ నలుగురు ఆటగాళ్లు ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే భారత జట్టులో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తు్న్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!