Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా నేడు టీమిండియా, వెస్టిండీస్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగనుంది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు టీమ్‌లకు డూఆర్ డైగా నిలవనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ఎలిమినేట్ అవుతుంది. అందుకే ఈ మ్యాచ్‌పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు టీమ్‌లు రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిసిన కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడారు. “ఇది చేజింగ్ గ్రౌండ్. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ ఇంకా మెరుగవుతుంది. ప్రేక్షకులకు మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాం. గత మ్యాచ్‌లో అన్ని బాక్సులు టిక్ చేశాం. అదే జట్టుతో కొనసాగుతున్నాం” అని చెప్పాడు. ఈ ప్రకటనతో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం అయింది. ఈడెన్ గార్డెన్స్ హోమ్ గ్రౌండ్‌గా ఉన్న రింకూ సింగ్‌కు అవకాశం దక్కలేదు. మరోవైపు వెస్టిండీస్ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అదనపు స్పిన్ ఆప్షన్‌గా అకీల్ హొసేన్‌ను జట్టులోకి తీసుకుంది. పవర్‌ప్లేలో బంతితో మరింత వైవిధ్యం ఇవ్వాలని వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా రోస్టన్ చేజ్‌ను ఓపెనర్‌గా జట్టులో పేర్కొన్నారు.
READ MORE: Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..
Also Read
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
- Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
- Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
భారత్ ప్లేయింగ్ ఎలెవన్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, గుడకేష్ మోటీ, షమార్ జోసెఫ్.
తాజావార్తలు
-
OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
-
Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్‌లో బయటపెట్టిన విశాల్
-
OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?
-
OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
-
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!