T20 World Cup 2024: అందరూ మహిళలే.. టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్ట్ ఇదే! ఏపీ నుంచి ఒకరు
- అక్టోబరు 3 నుంచి టీ20 ప్రపంచకప్
- ప్యానెల్‌ను ప్రకటించిన ఐసీసీ
- ఏపీ నుంచి జీఎస్ లక్ష్మి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2024 Female Panel of Match Officials: అక్టోబరు 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం అంపైర్ల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. టోర్నీ కోసం 10 మంది అంపైర్లు, ముగ్గురు రిఫరీలను ఐసీసీ అధికారులు నియమించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అందరూ మహిళా అంపైర్లే.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపికైన అంపైర్లలో క్లెయిర్ పొలోసక్ అత్యంత అనుభవజ్ఞురాలు. గత నాలుగు మహిళల టీ20 ప్రపంచకప్‌లలో ఆమె విధులు నిర్వర్తించారు. జాక్వెలిన్ విలియమ్స్, కిమ్ కాటన్‌లకు ఇది నాలుగో టీ20 ప్రపంచకప్. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 2023 ఫైనల్‌కు విలియమ్స్, కాటన్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించారు. భారత్ నుంచి వృంద రాఠీ అంపైర్‌గా, గండికోట సర్వ లక్ష్మి రిఫరీగా వ్యవహరించనున్నారు. ఏపీకి చెందిన లక్ష్మి.. 2023 ప్రపంచకప్ ఫైనల్‌కు రిఫరీగా వ్యవహరించారు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ఫుల్ లిస్ట్ ఇదే:
అంపైర్లు: లారెన్ ఏజ్‌బ్యాగ్, కిమ్ కాటన్, దంబనెవన, అనా హారిస్, నిమాలి పెరీరా, క్లెయిర్ పొలోసాక్, వృంద రాఠీ, రెడ్‌ఫెర్న్, షెరిడాన్, జాక్వెలియన్ విలియమ్స్.
రిఫరీలు: షాండ్రీ ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిషెల్ పెరీరా.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!