Big Bash League: 15 పరుగులకే ఆలౌట్.. బిగ్‌బాష్ లీగ్‌లో చెత్తరికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Bash League: బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. సిడ్నీ థండర్స్ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది. పురుషుల సీనియర్ టీ20 క్రికెట్‌లో ఇది అతి తక్కువ స్కోరు. ఇప్పటివరకు ఈ చెత్తరికార్డు టర్కీ పేరిట ఉండేది. టర్కీ జట్టు చెక్ రిపబ్లిక్ జట్టుతో మ్యాచ్ లో 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు టర్కీ జట్టుకు ఊరట కలిగిస్తూ సిడ్నీ థండర్ జట్టు ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
Sanskrit: 2500 ఏళ్ల నాటి సంస్కృత గ్రామర్ సమస్యను పరిష్కరించిన 27 ఏళ్ల యువకుడు
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌లో క్రిస్ లిన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కొలిన్ డీ గ్రాండ్‌హోం 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. గురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన్ డోగ్గెట్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 5.5 ఓవర్లకే 15 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లలో హెన్రీ థోర్న్ టన్, వెస్ అగర్ వికెట్ల పండగ చేసుకున్నారు. థోర్న్ టన్ 3 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా, వెస్ అగర్ 6 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ షార్ట్ 1 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 124 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!