Indian PhD student at Cambridge solves 2,500-year-old Sanskrit grammatical problem: 5వ శతాబ్ధం నుంచి దాదాపుగా 2500 ఏళ్ల నుంచి సంస్కృత భాషా పండితులకు సమస్యగా ఉన్న వ్యాకరణ సమస్యను ఓ 27 ఏళ్ల యువకుడు పరిష్కరించాడు. గురువారం ఈ సమస్యకు సంబంధించిన తన థీసిస్ ను ప్రచురించాడు. 27 ఏళ్ల రిషి రాజ్ పోపట్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నాడు. ‘‘ఇన్ పాణిని, వి ట్రస్ట్: డిస్కవరింగ్ ది అల్గారిథమ్ ఫర్ రూల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇన్ అస్తాధ్యాయి’’ అనే పేరుతో పాణిని బోధించిన రూల్ ని డీకోడ్ చేయడం ద్వారా రిషి ఈ ఘటత సాధించాడు. సంస్కృత భాషా శాస్త్ర పితామహుడిగా పాణిని పరిగణిస్తారు.
Read Also: Wasim Jaffer: విరాట్ కోహ్లీ తర్వాత అతడే స్టార్ బ్యాట్స్‌మెన్ అవుతాడు..
పలువురు సంస్కృత నిపుణులు దీన్ని విప్లవాత్మకమైనదిగా భావించారు. ఈ వ్యాకరణ సమస్యను పరిష్కరించినందుకు ఆనందంగా ఉందని రిషి రాజ్ పోపట్ అన్నారు. తొమ్మిది నెలలుగా దీన్ని ఛేదించేందుకు ప్రయత్నించానని.. ఒకనొక సమయం దీని నుంచి తప్పుకుందాం అని అనుకున్నానని అన్నాడు. అయితే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే దీన్ని పరిష్కరించేందుకు మార్గం దొరికిందని అన్నారు. రిషి ఆవిష్కరణలో ఇప్పుడు ఏదైనా సంస్కృత పదాలను రూపొందించడం సాధ్యం అవుతుంది, మిలియన్ల కొద్ది వ్యాకరణపరంగా సరైన పదాలను నిర్మించడం సాధ్యం అవుతుంది.
పాణిని రచించిన ‘అస్తాధ్యాయి’లో 4000 నియమాలు వివరించబడ్డాయి. దీన్ని క్రీస్తుపూర్వం 500లోొ రచించారు. శతాబ్ధాలుగా పండితులను కలవరపెడుతున్న సమస్యను నా విధ్యార్థి రిషి సాధించాడని రాజ్ పోపట్ పీహెచ్డీ సూపర్‌వైజర్ ప్రొఫెసర్ విన్సెంజో వెర్గియాని అన్నారు. సంస్కృతం ప్రపంచంలోని చాలా భాషలకు మూలం. యూరప్ లోని చాలా భాషలకు సంస్కృతమే మూలం. ఇండో – యూరోపియన్ భాషగా సంస్కృతాన్ని భావిస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కేవలం 25,000 మంది మాత్రమే సంస్కతం మాట్లాడుతున్నారు.