NTV Telugu Site icon

Sweet Corn Health Benefits: స్వీట్‌కార్న్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వయసుని కూడా తగ్గిచేస్తుంది!

Sweet Corn Benefits

Sweet Corn Benefits

Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్‌ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్‌ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్‌ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్‌ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits) కలుగుతాయో చూద్దాం.

జీర్ణక్రియ:
మొక్కజొన్న మీ శరీరానికి, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో పొట్టకు మేలు చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల తరచుగా మొక్కజొన్న తింటే.. మీ కడుపు శుభ్రంగా ఉంటుంది.

కంటి చూపు:
కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్వీట్‌కార్న్‌ ఉపయోగపడుతుంది. ఇందులో కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే ల్యూటిన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కజొన్న తినడం ద్వారా మీ కంటి చూపు పెరుగుతుంది. కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే.. మొక్కజొన్న తినాలి.

వెయిట్ లాస్:
మొక్కజొన్న తీసుకోవడం వల్ల బరువు సునాయాసంగా తగ్గుతారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల మీకు పదే పదే ఆకలి అనిపించదు.

Also Read: Weight Loss Tips: ఈ వ్యాయామం వారానికి 2 రోజులు చేసినా చాలు.. ఇట్టే బరువు తగ్గుతారు!

రక్తంలో చక్కెర నియంత్రణ:
రక్తంలో చక్కెరకు మొక్కజొన్న చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వీట్‌కార్న్‌ను రోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. మీకు రక్తంలో చక్కెర సమస్య ఉంటే మొక్కజొన్న తినవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు:
మొక్కజొన్నలోని ఎ, బి విటమిన్లు చురుకుదనాన్ని పెంచుతాయి. ఫోలేట్‌ గుండె సంబంధిత సమస్యల్ని అదుపులో ఉంచుతుంది.

వృద్ధాప్య ఛాయలు:
మొక్కజొన్న గింజల్లోని ఫెరులిక్‌ యాసిడ్‌ క్యాన్సర్‌కి అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాదు వృద్ధాప్య ఛాయలు త్వరగా మీద పడకుండా నియంత్రిస్తుంది.

Also Read: Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్‌ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!