Site icon NTV Telugu

Hyderabad: ఓయో రూంలో యువతి మృతదేహం.. ఇది హత్యా.. ఆత్మహత్యా..?

Beautician Crime Case

Beautician Crime Case

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్లో బ్యూటిషన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు… ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త తరహా మోసాలు..

ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు అనూష. హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌గా పని చేస్తూ జీవిస్తున్నారు. గతంలో పెళ్లి అయింది. కానీ.. భర్తతో సరిపడకపోవడంతో నెల రోజులకే విడిపోయి వేరుగా ఉంటోంది. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటూ బ్యూటీషియన్‌గా పని చేసుకుంటోంది. అయితే ఆమె 22న స్నేహితుల్ని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ మళ్లీ తిరిగి రాలేదు. చివరికి గచ్చిబౌలిలోని ఓ ఓయో హోటల్‌‌లో శవమై కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు..

READ MORE: Himachal Pradesh: హిమాచల్‌లో ‘‘క్లౌడ్ బరస్ట్’’.. మెరుపు వరదలు..

సాధారణంగా ఓయో రూముల్లో ఫ్రెండ్స్‌ను కలిసేందుకు వెళ్లరు. ఎవరో నమ్మకమైన మిత్రుడు లేదా మిత్రురాలు వచ్చి కలుస్తామంటేనే ఆమె ఓయో రూమ్ కు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఆ రూమ్‌కు ఎవరు వచ్చారు. ఎవరు వెళ్లారు అన్నదానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఇతర వివరాలు సేకరిస్తున్నారు. వివాహ జీవితంలో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. పూర్తిగా ఆత్మహత్య తరహాలోనే మరణం ఉండటంతో .. పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: SBI PO 2025: బ్యాంక్ జాబ్ కావాలా?.. ఎస్బీఐలో 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు రెడీ.. మీరూ ట్రై చేయండి

నిజానికి అనూష ఆన్ లైన్ ద్వారా సేవలు అందిస్తారు. ఆమెను ఎవరైనా బ్యూటీషియన్ సేవల కోసం ఓయో రూమ్‌కు పిలిపించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూమ్ అనూష పేరు మీద తీసుకోలేదని చెబుతున్నారు పోలీసులు. ఆ రూమ్‌లో అనూష ఒంటరిగా ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా అన్నదానిపై స్పష్టత వస్తే చాలా వరకూ కేసు చిక్కు ముడి వీడి పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. సంతోష్ అనే యువకుడితో మూడు రోజుల క్రితమే ఈ రూమ్ కి అనూష వచ్చిందని సీసీ ఫుటేజ్ ఆధారంగా బయటపడింది. ఐతే అనూష సోదరునికి కాల్ చేసిన సంతోష్‌.. మీ సోదరి చనిపోయిందని చెప్పాడు. సంతోష్, అనూష మధ్య జరిగిన వ్యవహారం పైనా ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్‌ని రికవరీ చేశారు..

READ MORE: Jeedimetla Murder Case: జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు..

ఓయో రూముల విషయంలో ఇటీవల కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. రూమ్ తీసుకున్న వారి పూర్తి వివరాలతో పాటు జంటలుగా వస్తే.. కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నారు. ఈ వివరాలతో పోలీసులు దర్యాప్తు వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అనూష.. తన కాళ్లపై తాను నిలబడిందని … ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదని తల్లిదండ్రులు అంటున్నారు. అనూష ఫోన్‌తో పాటు ఇతర గాడ్జెట్స్ ద్వారా హిస్టరీని తెలుసుకుని అనుమానాస్పద అంశాలు ఏమైనా ఉంటే పోలీసుల దర్యాప్తు మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని అంచనా వేస్తున్నారు పోలీసులు..

Exit mobile version