హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్లో బ్యూటిషన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు... ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.