AP Elections 2024: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ..! నేడు తేలనుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. శుక్రవారం రోజు ఢిల్లీ వేదికగా మూడు పార్టీల నేతల సమావేశం జరగాల్సి ఉండగా.. అది ఈ రోజుకు వాయిగా పడింది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బిజీ షెడ్యూల్ కారణంగా మీటింగ్ పోస్ట్‌పోయిన్ అయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ రోజు మూడు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు.. ఉదయం 11 గంటలకు పాట్నా పర్యటనకు వెళ్లనున్నారు అమిత్‌షా.. ఆలోగా ఈ సమావేశం జరగనుంది.. దీనిపై కోసం ఢిల్లీలోనే మకాం వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్..
Read Also: PM Modi : దేశంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్న మోడీ
Also Read
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
- DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
మరోవైపు.. ఏపీలో 10 పార్లమెంట్ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.. కనీసం 8 ఎంపీ స్థానాలైనా తమకు ఇవ్వాలని కోరుతున్నారట కమలం పార్టీ నేతలు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మొన్న రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో శుక్రవారం మరోసారి భేటీ కావాలనుకున్నా.. అది కూడా వాయిదా పడడంతో.. ఇవాళ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం విదితమే కాగా.. టీడీపీ, జనసేనల మధ్య ఇప్పటికే 118 చోట్ల సీట్ల పంపకాలు పూర్తి అయ్యాయి.. టీడీపీ 94 స్థానాలు, జనసేన 24 స్థానాల్లో పోటీకి సిద్ధం అయ్యాయి.. ఇక, లోక్‌సభ సీట్లలోనూ కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.. టీడీపీ 12 ఎంపీ స్థానాలు, జనసేన మూడు స్థానాల్లో పోటీకి రెడీ అవుతుండగా.. బీజేపీకి ఎన్ని సీట్లు అనేదానిపై క్లారిటీ వచ్చాక.. మిగతా స్థానాలపై టీడీపీ నిర్ణయం తీసుకోనుందట.. అయితే, బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న ఎంపీ స్థానాలపై ఇంకా అవగాహన కుదరలేదు.. విశాఖ లోక్‌సభ స్థానం కోసం బీజేపీ పట్టుబడుతోంది.. హిందూపురం, అనంతపురం, విజయవాడ స్థానాలు కూడా కావాలంటోంది. రాజంపేట, తిరుపతి, రాజమండ్రి, నరసాపురం, అరకు లోక్‌సభ స్థానాల్లో పోటీకి బీజేపీ ఏకాభిప్రాయంతో ఉందట. ఇక, జనసేనకు మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ లోక్‌సభ స్థానాలు కేటాయించనున్నారు.. అయితే, మూడు పార్టీల నేతలు నేడు తుది నిర్ణయం తీసపుకునే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!