Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెల ఇటీవల ‘NTV తెలుగు’ పాడ్‌కాస్ట్‌లో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ పాడ్‌కాస్ట్.. ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతూ.. తమ కుటుంబంలో మహిళలను కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా, ప్రతిరోజూ గౌరవిస్తారని తెలిపారు. తన తండ్రి చిరంజీవి, తమ్ముడు రామ్ చరణ్ నుంచి తనకు లభించిన అత్యుత్తమ బహుమతులు వారి ప్రేమ, ప్రోత్సాహమేనని పేర్కొన్నారు.
READ ALSO: CM Revanth Reddy : హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్..
తన నిర్మాణ సంస్థ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ పేరు వెనుక ఉన్న కథను వివరిస్తూ, ఒక సాయంత్రం ఆలోచిస్తున్నప్పుడు ఈ పేరు తట్టిందని, వెంటనే దానికి ఫిక్స్ అయిపోయానని చెప్పారు. నిర్మాతగా తను ఎప్పుడూ కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటానని, ప్రతి పనిలోనూ తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తనకు ఒక అన్నయ్యలా ఉంటారని, ఆయనతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని వివరించారు. ఉపాసన.. తను చాలా మంచి స్నేహితులమని తెలిపారు. తన సోదరి నిహారిక ఎప్పుడూ చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు.
తను సినీ రంగంలోకి రాకముందు స్టైలింగ్‌పై ఉన్న ఆసక్తి గురించి, ‘రంగస్థలం’ సినిమా సమయంలో రామ్ చరణ్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ముఖ్యంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు స్టైలింగ్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్‌గా అనిపించినప్పటికీ, నాన్నగారి కోసం పనిచేయడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. జీవితంలో తాను అనుసరించే సూత్రం గురించి చెబుతూ..”నేను చేసే పనితో నేను సంతృప్తి చెందుతున్నానా లేదా?” అని తనని తాను ప్రశ్నించుకుంటానని, ధార్మిక మార్గంలో సాగడమే తనకు ఇష్టమని సుస్మిత వివరించారు.
READ ALSO: Ustaad Bhagat Singh Trailer: ‘ఇది భగత్ గీత.. దమ్మున్నొడు దాటొచ్చు’.. ‘ఉస్తాద్’ ఊచకోత!
