Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Suryakumar Yadav T20 World Cup Final Retirement Rumours Akash Chopra Comments

Aakash Chopra: “ఇదే బెస్ట్ ఛాన్స్”.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్ వార్తలు మధ్య ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు

Published Date :March 8, 2026 , 8:00 am
By RAMAKRISHNA KENCHE
Aakash Chopra: “ఇదే బెస్ట్ ఛాన్స్”.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్ వార్తలు మధ్య ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Aakash Chopra: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఈ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా సూర్య నిలిచాడు. ఈ అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు సాధించాడు. గ్రూప్ దశలో యూఎస్‌ఏపై 84 పరుగులు చేశాడు. అయితే.. ఫైనల్ మ్యాచ్‌, రిటైర్మెంట్ వార్తల మధ్య భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ టీ20 వరల్డ్ కప్‌లో సూర్య పెద్ద జట్లపై బిగ్ స్కోర్ చేయలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని ఆకాశ్ చోప్రా కూడా ప్రస్తావించాడు. సూర్యకుమార్‌పై విమర్శలు కొంతవరకు అన్యాయమేనన్న చోప్రా.. మరోవైపు పెద్ద జట్లపై సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇదే బెస్ట్ ఛాన్స్ అంటూ సూచించాడు.

READ MORE: Women’s Day 2026:జగతికి జీవం పోసిన జోలాపాటకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

Also Read

  • Bengal's Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
  • Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
Add as a preferred
source on google

ప్రపంచంలోని అగ్ర జట్లపై ఇప్పటివరకు రెండు అర్ధశతకాలు మాత్రమే చేశాడని గుర్తు చేశాడు. చోప్రా మరో ఆసక్తికర విషయాన్ని గుర్తు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టి20 కెరీర్ ప్రారంభమైన మైదానం ఇదేనని తెలిపాడు. 2021లో భారత జట్టుకు తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఇక్కడే అన్నాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా బాదుతూ తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించినట్లు గుర్తు చేశాడు. అందుకే ఈ ఫైనల్ మ్యాచ్ సూర్యకుమార్ జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం కావొచ్చని చోప్రా అభిప్రాయపడ్డాడు. తన కెరీర్ ప్రారంభమైన మైదానంలోనే ప్రపంచకప్ ఫైనల్ ఆడుతూ మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడితే తన ప్రయాణం అద్భుతంగా మారుతుందన్నాడు.

READ MORE: Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..

ఇక గత ఏడాది సూర్యకుమార్ యాదవ్ అంతగా ఫామ్‌లో లేడు. టీ20 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం సైతం నమోదు చేయలేకపోయాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌పై జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో మంచి ఫామ్ తిరిగి సంపాదించాడు. అదే జోష్‌ను ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్‌లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికాపై చేసిన 84 పరుగుల తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొంత తగ్గినట్టు కనిపించినా, భారత జట్టుకు పెద్దగా ఇబ్బంది కలగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సంజూ శామ్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం వల్ల జట్టు స్థిరంగా ముందుకు సాగిందని అంటున్నారు. అయినప్పటికీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో కెప్టెన్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aakash Chopra comments Surya
  • India vs New Zealand final news
  • Sanju Samson Form
  • Surya T20 World Cup performance
  • Suryakumar Yadav retirement rumours

తాజావార్తలు

  • Bengal’s Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..

  • Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!

  • Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions