VFX : ‘రావు బహదూర్’ వీఎఫ్ఎక్స్ వెనుక తెలుగు వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా సాంకేతిక విభాగం ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంటూ దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ మాత్రమే కాదు, కథలో లీనమయ్యే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇండస్ట్రీలో సినిమాలు ఎక్కువయ్యాయి. ఇక వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రాంజీ డాట్ విజువల్ ఎఫెక్ట్స్‌ను కేవలం ఒక టెక్నికల్ అవసరంగా కాకుండా, కథను మరింత ప్రభావవంతంగా చెప్పే అద్భుత సాధనంగా మలుస్తూ టాలీవుడ్లో సరికొత్తగా సినిమా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. రాంజీ డాట్ ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన, వైవిధ్యమైన చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించి మెప్పించారు. ఒక్కో సినిమాలో ఆయన సృష్టించిన విజువల్స్ ఒక్కో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.
మహానటిలో పాతకాలపు (పీరియడ్) సెటప్ ను అత్యంత సహజంగా వెండితెరపై పునఃసృష్టించి ప్రశంసలు అందుకున్నారు. మిరాయ్ లో ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని నమ్మశక్యంగా ఆవిష్కరించడంలో సఫలమయ్యారు. ఇక రాంజీ డాట్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచింది ‘రావు బహదూర్’. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో సుమారు అరగంటపాటు పూర్తిగా క్రియేటివ్ 3D VFX ఆధారిత సన్నివేశాలే ఉంటాయి. ఇవి కేవలం సాధారణ గ్రాఫిక్స్ షాట్లు కావు; కాన్సెప్ట్ రూపకల్పన నుండి థియేట్రికల్ ఎగ్జిక్యూషన్ వరకు పూర్తిగా ఇమాజినేషన్ తో రూపొందించిన ప్రత్యేక విజువల్ సీక్వెన్స్‌లు. ఈ విజువల్స్ తెలుగు సినిమాలో క్రియేటివ్ వీఎఫ్ఎక్స్కు సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనున్నాయి. అంతేకాక ఆయన హైబ్రిడ్ లైవ్ యాక్షన్ టెక్నాలజీ ఆధారంగా ‘మహావీర్ కర్ణ’ టీజర్‌ను రూపొందించారు. రియల్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్, CGI, డిజిటల్ ఎన్విరాన్‌మెంట్స్‌ను సమర్థవంతంగా మిళితం చేస్తూ ఆయన అందించిన విజువల్స్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాయి.
Also Read
- Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
- Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
- Suriya 50: సూర్య 50వ సినిమాగా 'రోలెక్స్'.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
- The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
తాజావార్తలు
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
-
Vaibhav Sooryavanshi: బీసీసీఐ సమీక్ష సమావేశం.. వైభవ్ సూర్యవంశీపై కీలక నిర్ణయం!
-
Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!