సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.. వీరిద్దరి కాంబినేషన్‍లో మూడవ సినిమాగా గుంటూరు కారం రూపొందుతుంది.. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి అప్‍డేట్ల కోసం మహేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్ బాబు కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుండడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొని ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతుంది..తాజాగా గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ గురించి నిర్మాత నాగవంశీ మరోసారి అప్‍డేట్ ఇచ్చారు.గుంటూరు కారం సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‍ను దసరా రోజున లేకపోతే అంత కంటే ముందే తాము ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ తెలియజేశారు. దీనితో మరో వారం రోజుల్లోనే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది.
అలాగే, అనౌన్స్‌మెంట్ చేసిన తరువాత త్వరగానే ఈ పాట రిలీజ్ కూడా ఉంటుందని నాగవంశీ స్పష్టం చేశారు. ఓ ప్రెస్ మీట్‍కు హాజరైన ఆయన ఈ విషయంపై స్పందించారు.గుంటూరు కారం మొదటి సాంగ్ అంతా దాదాపు రెడీ అయిపోయింది. దసరా టైమ్‍కు డేట్ చెప్తాం” అని నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా సమయానికి గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ గురించి చెబుతామని ఇటీవల చెప్పిన నాగవంశీ.. నేడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబు సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. అలాగే మీనాక్షి చౌదరీ మరో హీరోయిన్‍గా నటిస్తున్నారు.. జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం మరియు మహేశ్ ఆచంట ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే గుంటూరు కారం మూవీ షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది.హారిక, హాసినీ క్రియేషన్స్ పతాకంపై గుంటూరు కారం సినిమాను చిన్నబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్ మరియు గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి..