ఇండస్ట్రీలో ఎవరెప్పుడు క్లిక్ అవుతారో, ఎవరికెప్పుడు ఎలాంటి స్టార్‌డమ్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎన్నేళ్లు కష్టపడినా లాభం ఉండదు కానీ, మరికొందరికి మాత్రం రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంటారు. యండ్ బ్యూటీ మమిత బైజు కి ఇలాంటి అదృష్టమే పట్టింది. మలయాళ ఇండస్ట్రీలో ముందుగా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన మమితకు ప్రేమలు సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అలా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మమిత తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తోంది. ఇక వరుసపెట్టి సినిమాలు చేస్తున్న అమ్మడు, క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో ఉందట. అంటే..
Also Read : NTR : దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్..!
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు.ఇప్పుడు మమిత అదే ఆలోచనలో ఉంది. అందుకె తన రెమ్యూనరేషన్ ను కూడా బాగా పెంచిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజంట్ మమిత టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ మూవీతో పాటూ, దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ‘జననాయగన్’ లో కూడా నటిస్తోంది. అయితే ఇంతకుముందు ఒక్కో సినిమాకు రూ. 50 లక్షలు లోపే ఛార్జ్ చేసిన మమిత, ఇప్పుడు డ్యూడ్ కోసం రూ.75 లక్షలు తీసుకుంటుందట. అంతే కాదు విజయ్‌తో చేస్తున్న ‘జననాయగన్’ సినిమాకైతే ఏకంగా మమిత రూ. 1 కోటి ఛార్జ్ చేస్తుందని సమాచారం. ఇక మరి ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని హిట్ అయితే మమిత క్రేజ్ మరింత పెరగడం ఖాయం. అప్పుడు మమిత తన రెమ్యూనరేషన్‌ను ఇంకా పెంచే అవకాశాలున్నాయి.