Site icon NTV Telugu

Supreme Court: “ఆపరేషన్ సిందూర్‌”లో పని చేశారని.. భర్య హత్య కేసులో మినహాయింపు ఇవ్వలేం..

Supremecourt

Supremecourt

వరకట్నం కోసం భార్యను హత్య చేశాడు ఓ భర్త.. కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. కోర్టులో ఆ భర్త విచిత్ర కోరిక కోరాడు. ఎంతటి వ్యక్తులకైనా చట్టం ఒక్కటే అని తెలియదేమే విచిత్ర కోరిక కోరాడు. తాను ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పని చేశానని.. ఈ కేసులో మినహాయింపు కల్పించాలని ఆ కమాండో సుప్రీంకోర్టును కోరాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ కమాండో కోరికపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నంత మాత్రాన కేసు నుంచి రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

READ MORE: Sruthi Haasan: శృతి హాసన్ ట్విట్టర్(X) అకౌంట్ హ్యాక్!

ఈ కేసు పంజాబ్ రాష్ట్రానికి చెందినది. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌లోని బ్లాక్‌ క్యాట్‌ కమాండో యూనిట్‌లో పనిచేస్తున్న ఓ కమాండోపై హత్య అభియోగాలు ఉన్నాయి. వరకట్నం కోసం తన భార్యను చంపినట్లు కేసు నమోదు కాగా.. పంజాబ్‌లోని ఓ ట్రయల్ కోర్టు 2004లో దోషిగా తేల్చింది. 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో ఆ కమాండో పంజాబ్‌, హర్యానా హై కోర్టును ఆశ్రయించాడు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అనంతరం అతడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. నాను ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నానని.. ఈ కేసులో మినహాయిచు కల్పించాలని పేర్కొన్నాడు. దీంతో కోర్టు స్పందించింది. ఈ కారణంతో దారుణ ఘటన నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. మినహాయింపులు కల్పించలేమని కుండబద్దలు గొట్టింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల గడువు ఇచ్చింది.

READ MORE: DGCA : దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో ‘సర్వేలెన్స్’..

Exit mobile version