Currency Notes On Road : కదులుతున్న కారునుంచి కరెన్సీ నోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Currency Notes On Road : గురుగ్రామ్‌లోని ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు ఇబ్బందుల్లో పడ్డారు. షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు. గురుగ్రామ్‌లోని ఇద్దరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని మళ్లీ రూపొందించడానికి ప్రయత్నించారు. కదులుతున్న కారు ట్రంక్ నుండి కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరారు.
Read Also: Insect rain in China : చైనాలో పురుగుల వాన.. కలియుగ అంతం వచ్చేసింది
Also Read
ఘటనకు సంబంధించిన వీడియోలో ఒకరు కారు నడుపుతుండగా, మరొకరు వాహనం ట్రంక్‌లోంచి నోట్లు విసరడం, వీడియో నేపథ్యంలో మ్యూజిక్ ప్లే అవుతుండడం చూడవచ్చు. కరెన్సీ నోట్లను విసిరే వ్యక్తి ముఖంలో సగం గుడ్డ కప్పి ఉంది. ఇద్దరు యువకులు విసిరిన కరెన్సీ నోట్లు నకిలీవో, నిజమో ఇంకా తెలియరాలేదు. ఈ వీడియోను ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో త్వరలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Read Also: Ustaad: పవన్ కళ్యాణ్ ‘విజయ్’లా నటించట్లేదు మాస్టారు… అడగండి అప్డేట్ ఇస్తాను
“గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో కారులోంచి కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు సినిమాలోని సీన్‌ను రీ-క్రియేట్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన గురించి సోషల్ మీడియాలో వీడియో ద్వారా పోలీసులకు తెలిసింది. పోలీసులు IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులను గుర్తించాం’’ అని డీఎల్‌ఎఫ్ గురుగ్రామ్ ఏసీపీ వికాస్ కౌశిక్ చెప్పినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. మంగళవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | Haryana: A video went viral where a man was throwing currency notes from his running car in Gurugram. Police file a case in the matter.
(Police have verified the viral video) pic.twitter.com/AXgg2Gf0uy
— ANI (@ANI) March 14, 2023
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!