Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఓటర్ల తొలగింపులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఇండియా కూటమి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ 14 లోపాలను (టెక్నికల్ పాయింట్స్) ఎత్తిచూపింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు మరో 10 మంది ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌లోని లోపాలు ఇంకా సరిదిద్దకపోవడంతో ఇది విచారణ జాబితాలోకి రాలేదు. అయితే, ఈ అభ్యంతరాలన్నీ పిటిషన్ దాఖలు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించినవి మాత్రమేనని, పిటిషన్‌లోని ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టు ఎలాంటి న్యాయపరమైన తీర్పు ఇవ్వలేదని గ్రహించాలి.
ముఖ్యంగా లాయర్ల అధికార పత్రాలు లేకపోవడం లేదా సంతకాలు సరిగ్గా ఉండకపోవడం, డాక్యుమెంట్లు సరిగ్గా కనిపించకపోవడం, కోర్టు ఫీజు రూ. 220 తక్కువ కావడం వంటి అంశాలను రిజిస్ట్రీ వేలెత్తి చూపింది. ఆర్టికల్ 32 కింద వేసిన ఈ పిటిషన్లో వ్యక్తిగతంగా ఎలక్షన్ కమిషనర్ల పేర్లను ప్రైవేట్ ప్రతివాదులుగా ఎందుకు చేర్చారో వివరణ ఇవ్వాలని కోరింది. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తింపు కార్డు కాపీ స్పష్టంగా ఉండాలని, సౌగతా రాయ్, అఖిలేష్ యాదవ్, తేజస్వి ప్రసాద్ యాదవ్, సంజయ్ రౌత్, ఎంఏ బేబీ, డి రాజా, మహువా మాజి, సుప్రియా సూలే, ఈటీ మహమ్మద్ బషీర్ వంటి తొమ్మిది మంది నేతలకు సంబంధించిన వకాలత్నామాలు (న్యాయవాదికి ఇచ్చే ప్రాతినిధ్య పత్రాలు) సరిగ్గా లేవని తెలిపింది. వీటితో పాటు జూన్ 24, 2025న ఈసీ తీసుకున్న నిర్ణయం, ఓటర్ల తొలగింపులకు సంబంధించిన ఇతర రికార్డుల కాపీలను పెన్ డ్రైవ్‌లో స్పష్టమైన డిజిటల్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
రాహుల్ గాంధీతో సహా 11 మంది నేతలు సోమవారం దాఖలు చేసిన ఈ పిటిషన్లో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపులు, మార్పులపై ఒక నిర్దిష్ట సమయావధిలో ఆడిట్ జరిపేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సాంకేతిక నిపుణులు, ప్రముఖులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. కోర్టు దీనిపై తుది నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను మధ్యంతరంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఏ ఒక్క ఓటరు పేరును జాబితా నుంచి తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని నేతలు కోరారు. పంజాబ్ వంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ చట్టబద్ధమైన గడువు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. తొలగించిన ఓటర్ల వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా, తొలగించడానికి గల కారణాలతో సహా వయస్సు, లింగం వారీగా వర్గీకరించి పబ్లిక్ చేయాలని.. అలాగే అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చేలా ఒక మెకానిజాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్లో ఎన్నికల సంఘం రికార్డులను కూడా బయటపెట్టాలని కోరారు. ఎస్ఐఆర్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లు, అజెండాలు, మినిట్స్, అంతర్గత నోట్స్, వచ్చిన అభ్యంతరాలు, అలానే ECINET, ERONET సిస్టమ్స్ యాక్సెస్ లాగ్స్‌తో పాటు జూన్ 24, 2025 నాటి నిర్ణయం ఫైల్ మొత్తాన్ని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, సీఈసీ, ఇతర ఈసీల చట్టం 2023లోని సెక్షన్ 18, సుప్రీంకోర్టు పూర్వపు తీర్పులకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 32 కింద కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, నమోదు నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ ‘ఫారమ్ 6’ ప్రక్రియలో మార్పులు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో అత్యంత అత్యవసర పరిస్థితిని వివరించడానికి పంజాబ్ ఉదాహరణను పిటిషన్లో ప్రస్తావించారు. ఆగస్టు 13, 2026న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం, జూన్ నెలలో 2.14 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా 20.66 లక్షల మేర తగ్గిపోయినట్లు చూపించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా అక్రమాలు ప్రజాస్వామ్య సమగ్రతను, అర్హులైన పౌరుల ఓటు హక్కును దెబ్బతీస్తాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?