బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దోషుల విడుదలకు సంబంధించిన తమ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో గుజరాత్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లైంది.
ప్రతి బూత్‌లో పోలింగ్ ముగిసిన 48 గంటలలోపు పోలైన ఓట్లు/లేదా తిరస్కరించబడిన ఓట్లతో సహా ఓటరు ఓటింగ్ డేటాను విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను లోక్‌సభ ఎన్నికల ముగిసే వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.