Bandi Sanjay: తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనం. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై బండి సంజయ్ ఎక్స్ వేదికగా శనివారం స్పందించారు. రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తారు, ఇందులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి భద్రాచలంలోని పాండురంగాపురం వరకు రూ. 4,109 కోట్లతో 200.60 కి.మీ పొడవున కొత్త లైన్‌ను నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ లైన్ పూర్తి చేసి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని స్పష్టం చేశారు.
Read also: CM Revanth Reddy: నగరంలో జోయిటిస్ విస్తరణ.. సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ
ఈ ప్రాజెక్టు వల్ల చాలా రాష్ట్రాలు లబ్ది పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణమ్ తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.24,657 కోట్లు. 8 ప్రాజెక్టులలో ఒకటి మల్కన్ గిరి-పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కి.మీ. ఇది తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం మరియు మల్కన్‌గిరి (AP, తెలంగాణ, ఒడిశా) జిల్లాలను కవర్ చేస్తుంది.
Eight new railway line projects across various Indian states is testimony for Hon’ble PM @narendramodi ji’s resolve to strengthen the railway network.
Specifically, in the context of Telangana, the Malkangiri-Pandurangapuram (via Bhadrachalam) railway line project is noteworthy.… pic.twitter.com/4Nl1GH2aea
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 10, 2024
Funny Thief in Siddipet: అంబులెన్స్ దొంగలించిన దొంగ.. అరగంటలో యాక్సిడెంట్ ఆసుపత్రికి