Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Supreme Court Dismisses Telangana Bjps Petition Against Cm Revanth Reddy

Supreme Court: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు.. సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పిటిషన్ కొట్టివేత

Published Date :September 8, 2025 , 11:51 am
By Venkatesh
  • సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు
  • సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పిటిషన్ కొట్టివేత
Supreme Court: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురు.. సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పిటిషన్ కొట్టివేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. సీఎం పై తెలంగాణ బిజెపి వేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని, కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయన్నారు చీఫ్ జస్టిస్. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి అని స్పష్టం చేశారాయన. కేసు డిస్మిస్ చేశాక, బిజెపి తరపున న్యాయవాది వాదనలు పొడిగించే ప్రయత్నం చేశారు. దాంతో సీరియస్ అయిన ధర్మాసనం 10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Also Read:Ponnam Prabhakar: తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వివక్ష.. రైతులు ఉద్యమించే వరకు చూస్తోంది

తెలంగాణ బిజెపి సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి పై ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావాను హైకోర్టు రద్దు చేయడంతో తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మే 4 న కొత్తగూడెంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గతేడాది ఫిర్యాదు చేశారు.

Also Read:SBI Recruitment 2025: గెట్ రెడీ.. ఎస్బీఐలో 6,589 పోస్టులు.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు విడుదల

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి మాట్లాడారని తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ ట్రయల్‌ కోర్టు 2023 ఆగస్టులో ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రజాప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్‌ 125 కింద కేసు కొనసాగుతుందని ఆదేశించింది. దాంతో సీఎం రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, రాజకీయ ప్రసంగాలు తరచుగా అతిశయోక్తులతో నిండినవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించడం తగదని వాదించారు. ఆగస్టు 1 న హైకోర్టు రేవంత్‌రెడ్డి వాదనను సమర్థిస్తూ ట్రయల్‌ కోర్టు ఆదేశాలను రద్దు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2024 Elections
  • BJP petition
  • CM Revanth Reddy
  • defamation case
  • Kasam Venkateshwarlu

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions