సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. సీఎం పై తెలంగాణ బిజెపి వేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ కీలక వాఖ్యలు చేశారు. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని, కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయన్నారు చీఫ్ జస్టిస్. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి అని స్పష్టం చేశారాయన. కేసు డిస్మిస్ చేశాక, బిజెపి తరపున న్యాయవాది వాదనలు పొడిగించే ప్రయత్నం చేశారు. దాంతో సీరియస్ అయిన ధర్మాసనం 10 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Also Read:Ponnam Prabhakar: తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వివక్ష.. రైతులు ఉద్యమించే వరకు చూస్తోంది
తెలంగాణ బిజెపి సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి పై ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావాను హైకోర్టు రద్దు చేయడంతో తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మే 4 న కొత్తగూడెంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గతేడాది ఫిర్యాదు చేశారు.
Also Read:SBI Recruitment 2025: గెట్ రెడీ.. ఎస్బీఐలో 6,589 పోస్టులు.. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు విడుదల
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి మాట్లాడారని తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రయల్ కోర్టు 2023 ఆగస్టులో ఐపీసీ సెక్షన్లతో పాటు ప్రజాప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 125 కింద కేసు కొనసాగుతుందని ఆదేశించింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, రాజకీయ ప్రసంగాలు తరచుగా అతిశయోక్తులతో నిండినవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించడం తగదని వాదించారు. ఆగస్టు 1 న హైకోర్టు రేవంత్‌రెడ్డి వాదనను సమర్థిస్తూ ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేసింది.
