Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఢిల్లీలో (Delhi) దీపావళి గిఫ్ట్స్ (Diwali gifts) ఇచ్చిపుచ్చుకునే కల్చర్ వల్ల రోడ్లపై వాహనాల రద్దీ పెరిగి, వాయు కాలుష్యం (Vehicular pollution) మరింత ప్రమాదకర స్థాయికి చేరుతోందని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో గాలి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్న తరుణంలో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రజల జీవన శైలిలో ఓ పెద్ద మార్పు రావాలని సీజేఐ (CJI) సూర్య కాంత్ అభిప్రాయపడ్డారు. ధనవంతులు దీపావళి కానుకల బట్వాడాను కేవలం ఓ ఆచారంగా కాకుండా, తమ సోషల్ స్టేటస్ (Social status) కోసమే ఎక్కువగా వాడుతున్నారని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
సాధారణంగా దీపావళి (Diwali) సీజన్ వచ్చిందంటే చాలు, ఉత్తరాదిలో గిఫ్ట్స్ ప్యాకింగ్, వాటిని డెలివరీ చేసే హడావుడి ఎక్కువవుతుంది. నవంబర్ 8న రాబోయే పండుగ కోసం మార్కెట్లన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇదే సమయంలో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే పొల్యూషన్, అలాగే ఊర్ల నుంచి వచ్చే వాహనాలతో ఢిల్లీ అచ్చం గ్యాస్ చాంబర్‌లా మారుతోంది. అసలు సిసలు సమస్య వాహనాల సంఖ్య కాదని, బయటి ప్రాంతాల నుంచి ఎలాంటి కండిషన్లో ఉన్నాయో కూడా తెలియని వెహికల్స్ నగరంలోకి దూసుకొచ్చి కొద్దిసేపట్లోనే భారీగా కాలుష్యాన్ని వదిలి వెళ్తున్నాయని కోర్టు పేర్కొంది. దేశం నూలుమూలల నుంచి వచ్చే ఈ వాహనాలను ఎక్కడికక్కడ పర్యవేక్షించడం (Monitor) కష్టంగా మారిందని అదర్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. ఇప్పటికే కాలుష్యాన్ని కట్టడి చేయడానికి జీఆర్ఏపీ (GRAP) స్టేజ్ 2 అమల్లో ఉందని, పీయూసీ (PUC) సర్టిఫికెట్లను కూడా జియో ట్యాగింగ్ (Geotagging) చేస్తున్నామని కోర్టుకు తెలిపారు.
Also Read
- Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
- Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
- OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
- Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
అయితే కేవలం వెహికల్స్ నంబర్ల గురించే కాకుండా, రోడ్లపై అవి తిరిగే సమయం గురించీ ఆలోచించాలని న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ పండుగ సంస్కృతిలో వస్తున్న మార్పుల వల్ల అసలు సిసలు పండుగ ఆత్మ దెబ్బతింటోందని జస్టిస్ జాయ్మాల్య బాగ్చి అన్నారు. పండుగలు కాస్తా వ్యాపార వస్తువులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఆచారాలను ఆపేయాలనే వాదన వచ్చినప్పుడు, దానివల్ల ఉపాధి కోల్పోయే పేదల గురించి కూడా ఆలోచించాలని సీజేఐ గుర్తుచేశారు. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ స్టేటస్ సింబల్ కోసం గిఫ్ట్స్ ఇచ్చే సంపన్నులే అసలు కాలుష్యానికి కారణమని, కానీ ప్రమిదలు అమ్ముకుంటూ బతికే పేదలు మాత్రం ఎలాంటి పొల్యూషన్‌ను సృష్టించరని స్పష్టం చేశారు. కేవలం కోర్టులు ఆర్డర్లు వేస్తే సరిపోదని, ప్రజల నుంచి కచ్చితంగా సహకారం ఉంటేనే ఈ సమస్య తగ్గుతుందని కోర్టు తేల్చిచెప్పింది. ఏఆర్డర్లు పెట్టినా ఉల్లంఘనలు (Violations) ఆగవని, లోకల్ కౌన్సిలర్లు (Local councillors), ఆర్డబ్ల్యూఏలు (RWAs) రంగంలోకి దిగి కాలుష్య రహిత దీపావళి జరుపుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలని సుప్రీంకోర్టు సూచించింది.
తాజావార్తలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
-
Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
-
Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!