Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Supreme Court Announce Verdict On Same Gender Marriage In India

Same Gender Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వేర్వేరు తీర్పులు..!

Published Date :October 17, 2023 , 1:00 pm
By Sampath Kumar
Same Gender Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వేర్వేరు తీర్పులు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Verdict to be out on Same Gender Marriage form Supreme Court: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైందని కాదని స్పష్టం చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని పేర్కొంది.

కోర్టులు చట్టాలను రూపొందించవని, కానీ వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ డీవై చంద్రచూడ్‌ చెప్పారు. వివాహ వ్యవస్థ స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే మనం స్వాతంత్ర్యానికి ముందు రోజులకు వెళ్లినట్లేనన్నారు. ప్రత్యేక వివాహ చట్టం అవసరమా? లేదా? అనేది పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని, దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని సీజేఐ తెలిపారు.

Also Read

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

స్వలింగ సంపర్కుల బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీజేఐ డీవై చంద్రచూడ్‌ సూచించారు. వివాహేతర జంటలతో పాటు స్వలింగ సంపర్కులు బిడ్డలను దత్తత తీసుకోవచ్చన్నారు. భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదని చెప్పారు. ఇక సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, రవీంద్ర భట్‌, హిమా కోహ్లీ, పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీంకోరు తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత నేడు తీర్పును వెలువరించింది.

Also Read: Salman Khan: విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’.. సల్మాన్ ఖాన్ ఫిదా!

2018 సెప్టెంబర్‌లో స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. సాంస్కృతిక విలువలను పక్కనపెట్టి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. స్వలింగ సంపర్కం నేరం కాదని కోర్టు చెప్పినా.. తమకు సామాజిక అంగీకారం లభించడం లేదని, తమపై వివక్ష సాగుతూనే ఉందని లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్.. వర్గం ఫిర్యాదు చేస్తోంది. స్వలింగ సంపర్కం నేరం కాదని చెప్పిన అనంతరం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కావాలని డిమాండ్ చేశారు. పెళ్లిళ్ళను చట్టబద్ధమైనవిగా గుర్తించాలని 2020లో ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పిటిషన్లు చేరాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • same gender marriage
  • Same Sex Marriage
  • SC
  • SC verdict on Same Sex Marriage

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions