ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో చెలరేగడంతో లంకను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 302 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ వరల్డ్ కప్తో సెమీఫైనల్కు చేరిన జట్టులో టీమిండియా తొలి జట్టుగా నిలిచింది.
Puri Jagannath: దేవుడా.. గుర్తుపట్టలేకుండా మారిపోయిన పూరి.. అసలేమైంది.. ?
ఈ మ్యాచ్లో మహ్మద్ షమీ 5 వికెట్లు పడకొట్టగా.. సిరాజ్ 3 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బకొట్టారు. అంతకుముందు భారత్ బ్యాటింగ్లో శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 50 ఓవర్లలో 357 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ప్రపంచకప్‌లో 7 మ్యాచుల్లో 7 గెలిచి టైటిల్‌పై బలమైన హక్కును భారత్ సొంతం చేసుకుంది.
మరోవైపు భారత్ నిర్దేశించిన 357 పరుగులను చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు ఆరంభం బాగాలేదు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో తొలి బంతికే పాతుమ్ నిశాంక (డకౌట్) జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాత దిముత్ కరుణరత్నే మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. దిముత్ కరుణరత్నే కూడా ఖాతా తెరవలేకపోయాడు. ఆ సమయంలో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయినప్పటికీ జట్టు స్కోరు 2 పరుగులు ఉంది.
Honour Killing: పాకిస్తాన్‌లో పరువు హత్య.. యువ జంటని కాల్చి చంపేశారు..
అక్కడితో శ్రీలంక వికెట్ల పరంపర ఆగలేదు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ (1), చరిత్ అసలంక (1) పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దుషన్ హేమంత కూడా డకౌట్ అయ్యాడు. భారత బౌలర్ల విధ్వంసం ధాటికి.. 22 పరుగులకే 7 వికెట్లు కోల్పోయాయి. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో ఐదుగురు పరుగులు చేయకుండానే ఔటయ్యారు. శ్రీలంక జట్టులో 8 మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ఒక్క అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ పోరాడేందుకు ప్రయత్నించినా.. అతడు కూడా శ్రీలంకకు భారీ ఓటమిని తప్పించలేకపోయాడు.
Mohammed Shami: మహ్మద్ షమీ ఖాతాలో మరో రికార్డ్
అంతకుముందు శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 94 బంతుల్లో 88 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 56 బంతుల్లో 82 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మధ్య 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 5 వికెట్లు తీశాడు. దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టాడు.
