వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో చెలరేగడంతో లంకను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 302 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు బెర్త్ ఖాయం చేసుకుంది.