DC vs SRH: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. సన్‌రైజర్స్ నెగ్గేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC vs SRH: ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కంటే హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్, బౌలింగ్‌లోనూ చాలా బలంగా ఉంది. ఇదిలా ఉండగా ఢిల్లీ తన చివరి మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంగా ఉంది. విజయపరంపరను అలాగే కొనసాగించాలని హైదరాబాద్‌తో పోరుకు రెడీ అయింది. ఇక ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పిచ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Read Also: Traffic: ప్రపంచంలో అత్యంత చెత్త ట్రాఫిక్ ఉన్న నగరాలు
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ఈ తరుణంలో సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ జట్టు పరీక్షకు సిద్ధమైంది. వరుసగా రెండు ఓటములు, తర్వాత రెండు విజయాలు, మళ్లీ ఓటములతో ఉన్నా హైదరాబాద్ జట్టు.. వరుస ఓటములకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ కేకేఆర్‌పై సెంచరీ బాదినా.. దానికి ముందు, తర్వాత విఫలమయ్యాడు. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా అంచనాలకు తగ్గట్లుగా ఆడడం లేదు. బ్యాటింగ్ కుదురుగా లేకపోయినా, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పేసర్లు భువనేశ్వర్, జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్.. స్పిన్నర్లు మయాంక్ మార్కండే, వాషింగ్టన్ సుందర్, మయాంక్ దాగర్ వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఢిల్లీ బ్యాటింగ్‌లో కెప్టెన్ వార్నరే దిక్కు. ఢిల్లీలోని ఇతర బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు కుదురుకోలేదు. బౌలర్లు బాగా రాణిస్తున్నారు. మరి ఆ జట్టును సన్‌రైజర్స్ ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?