Sunny Leone’s photo appears on UP Police recruitment exam admit card: ప్రస్తుతం బాలీవుడ్ నటి ‘సన్నీ లియోన్’ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సినిమాకు సంబందించినదో లేదో ఏదో మంచి పని చేసో సన్నీ పేరు వార్తల్లో నిలవలేదు. ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించిన అడ్మిట్ కార్డులో సన్నీ ఫొటో ఉండటం ఇందుకు కారణం. అడ్మిట్ కార్డులో ఒకటి కాదు రెండు ఫొటోలు ఉండడం విశేషం. అయితే సన్నీ లియోన్ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు ఫేక్ని యూపీ పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎవరో సన్నీ ఫొటోను అప్లోడ్ చేశారని స్పష్టం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రొమోషన్ బోర్డ్ గతంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీపీఆర్బీ వెబ్సైట్లో తాజాగా సన్నీ లియోన్ పేరు, ఫొటోతో కూడిన అడ్మిట్ కార్డు కనిపించింది. అడ్మిట్ కార్డ్ ప్రకారం… ఎగ్జామినేషన్ సెంటర్ కన్నౌజ్ తిర్వాలోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీ కాగా, ఫిబ్రవరి 17న పరీక్ష తేదీ ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన మొబైల్ నంబర్ యూపీలోని మహోబాలో నివాసం ఉండే వ్యక్తిది కాగా.. చిరునామా ముంబైలో ఉంది. పరీక్ష రోజున అభ్యర్థులెవరూ ఆ అడ్మిట్ కార్డుతో హాజరు కాలేదని కళాశాల అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
Also Read: Rashmika Mandanna: మరణం నుంచి తప్పించుకున్నా.. రష్మిక పోస్ట్ వైరల్!
సన్నీ లియోన్ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు ఫేక్ని యూపీ పోలీసులు తేల్చార. రిజిస్ట్రేషన్ సమయంలో ఎవరో సన్నీ ఫొటోను అప్లోడ్ చేశారని పోలీసులు స్పష్టం చేశారు. సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్టు వివరించారు. ఇక యూపీలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష శనివారం మొదలైంది. రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 17, 18) పరీక్షలు జరగనున్నాయి. శనివారం యూపీలో 120 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతరుల కోసం పరీక్షలు రాయడానికి వచ్చిన వారు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. 15 మంది.. కాపీ కొడుతూ, చీటింగ్ చేస్తూ దొరికిపోయారట.
Sunny Leone applied for UP police constable examination….😅😅 pic.twitter.com/YuxYMzGjwt
— Simple man (@ArbazAh87590755) February 17, 2024