టీమిండియాలో ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది.. మన పని ఏంటి? అది చేశామా.. లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కనీసం పక్కనున్న ప్లేయర్ ఎలా ఉన్నాడు? ఏం ఆలోచిస్తున్నాడనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదని ఆర్. అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అశ్విన్ చేసిన కోలిగ్స్ కామెంట్లు నన్ను చాలా బాధపెట్టాయని సీనియర్ క్రికెటర్ సునీల్ గావాస్కర్ అన్నారు. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? క్రికెట్ గురించి కాకపోయినా మ్యూజిక్ గురించి, సినిమాల గురించి,…