Site icon NTV Telugu

MS Dhoni: టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎంఎస్ ధోని..?

Dhoni

Dhoni

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింవగ్ ధోనీ ప్రపంచ క్రికెట్ నుంచి రిటైర్మైంట్ అయినప్పటికీ ఐపీఎల్ లో అద్భుతమైన ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ సీజన్ లో ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించిన ధోని సారథ్యంలోని చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సీఎస్కే మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు పూర్తిగా అవకాశాలు లభించినట్లే..

Also Read : Atchannaidu: తెలుగు విద్యార్ధులను ఆదుకోవడంలో జగన్ విఫలం

ఇలా ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న మహీ భారత జట్టుకు హెడ్ కోచ్ గా రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. భారత జట్టు హెడ్ కోచ్ గా ధోనీ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ మాత్రం ఇచ్చాడు. రిసెంట్ గా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. ఎంఎస్ ధోనీ త్వరలోనే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టవచ్చు.. అది తప్పక జరగాలని అనుకుంటున్నాను ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Varshini : వర్షిణి అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే..

జట్టు కోసం ఏదైనా బాధ్యతలు తీసుకునే ముందు కొంత రిలాక్స్ కావాలనేది నా ఉద్దేశం అని గవాస్కర్ అన్నారు. అది సెలక్షన్ కమిటీ, మేనేజర్, హెడ్ కోచ్.. ఏదైనా కొంత విశ్రాంతి అసవరం అని తెలిపారు. ఎంఎస్ ధోనికి ఆ విశ్రాంతి దొరికింది.. ఇంకా ధోనికి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా లేదా.. టీమ్ హెడ్ కోచ్ గా కానీ.. లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్ గా బీసీసఐలో కీలకమైన పదవి దక్కుతుంది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు.

Also Read : PM warangal tour: మరోసారి తెలంగాణకు మోడీ.. ఈసారి ఏ జిల్లాలో అంటే..

ఎంఎస్ ధోనికి ఉన్న అనుభవం.. విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం అని గవాస్కర్ వెల్లడించారు. ధోనీ అనుభవం టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సన్నీ మాటలపై భారత క్రికెట్ అభిమానులు, ధోని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అది జరగాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Exit mobile version