Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో పవార్ కుటుంబం తన పట్టును మరోసారి నిలబెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బారామతి సీటు పవార్ కుటుంబానికి కంచుకోటగా చెబుతుంటారు. అజిత్ పవార్ ఇక్కడి నుంచి వరుసగా ఎనిమిది సార్లు విజయాన్ని సాధించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన, తన మేనల్లుడు యోగేంద్ర పవార్‌తో సహా 24 మంది అభ్యర్థులపై పోటీ చేసి 1,81,000 ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
READ ALSO: Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
రాజకీయంగా కీలకమైన బారామతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఒక పెద్ద అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఆకాష్ విశ్వనాథ్ మోరేను ఆ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఈ స్థానం నుంచి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు బారామతి నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు వారి నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. బారామతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరుఫున న్యాయవాది ఆకాష్ మోరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించగా, ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఏప్రిల్ 5, 2026న దీనిని లాంఛనంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఈ ఉప ఎన్నికల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. నిజానికి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో నియోజకవర్గంలో సునేత్ర పవార్‌పై సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది.
మొదట్లో సునేత్రా పవార్ ఏకగ్రీవంగా గెలవాలని డిమాండ్లు వచ్చాయి, కానీ కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఈ పోటీని హై-ప్రొఫైల్‌గా మార్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఈ పోరు నుంచి వైదొలగడంతో, వాతావరణం మరోసారి పవార్ కుటుంబానికి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. బారామతి, రాహురి అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగాల్సి ఉంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే బారామతి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వైదొలగడంతో ఇప్పుడు సునేత్ర పవార్ విజయం ఖాయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: Hezbollah Chief: ఇరాన్‌కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!