Hezbollah Chief: ఇరాన్‌కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah Chief: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసీమ్ మృతి చెందారు. తమ దాడుల్లో నయీం ఖాసీమ్ మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే హిజ్బుల్లా అధిపతి నయీమ్ ఖాసీమ్ కార్యదర్శి, మేనల్లుడు అయిన అలీ యూసుఫ్ హర్షీని కూడా హతమార్చినట్లు పేర్కొంటూ ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటన విడుదల చేశాయి. IDF దళాలు లెబనీస్ రాజధాని బీరుట్‌లో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు.
READ ALSO: Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
లెబనాన్‌లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు, ఆయుధ డిపోలపై బుధవారం రాత్రి వరుస దాడులు నిర్వహించినట్లు IDF పేర్కొంది. ఈ ఆపరేషన్ల ముఖ్య ఉద్దేశ్యం, ఆ ఉగ్రవాద సంస్థ యొక్క కమాండ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా దెబ్బతీయడం, దాని ఆయుధ సరఫరా మార్గాలను పూర్తిగా నిలిపివేయడం అని పేర్కొంది. బుధవారం రాత్రి బీరూట్‌లోని ఒక ప్రాంతంలో ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) వైమానిక దాడి జరిపినట్లు ఆ సంస్థ ప్రకటించింది . ఈ దాడిలో హిజ్బుల్లా అధిపతి, ఆయన కార్యదర్శి అలీ యూసఫ్ హెర్షి మరణించారు. IDF ప్రకారం.. ఈ ఇద్దరు అగ్ర నాయకుల మరణం హిజ్బుల్లా నాయకత్వ వ్యవస్థకు గణనీయమైన దెబ్బగా అభిప్రాయపడ్డారు. ఈ దాడి బీరూట్‌లోని ఆ బృందం యొక్క కీలక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్న ప్రాంతంలో జరిగింది.
రాత్రి సమయంలో లిటాని నది మీదుగా ఉత్తరం నుంచి దక్షిణానికి రాకపోకల కోసం ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్‌లను కూడా ఐడిఎఫ్ ధ్వంసం చేసింది. ఈ మార్గాలను హిజ్బుల్లా కమాండర్లను, వేలాది ఆయుధాలను, రాకెట్లను, లాంచర్లను తరలించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ చర్య హిజ్బుల్లా పోరాట సామర్థ్యం, లాజిస్టిక్స్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని సమాచారం. దక్షిణ లెబనాన్‌లోని సుమారు 10 హిజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ పేర్కొంది . రాకెట్ దాడులకు ప్రణాళికలు రచిస్తున్న హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. హిజ్బుల్లా మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమయ్యే వరకు ఉగ్రవాదంపై తమ పోరాటం కొనసాగుతుందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!