Rajini – Kamal: రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో సినిమా అనౌన్స్ చేయబడిన సంగతి తెలిసిందే. తమిళంలో ఎంటర్‌టైనింగ్ సినిమాలు చేస్తాడని పేరు ఉన్న సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని ప్రకటించారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు సుందర్ సి అధికారికంగా ఒక లేఖ విడుదల చేశారు; మీడియాలో ఈ లేఖని పోస్ట్ చేశారు.
Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..?
“రజనీ హీరోగా, తాను దర్శకత్వంలో, కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా రూపొందుతుందంటే తనకు చాలా గర్వకారణం” అని, “కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని” పేర్కొన్నారు. తనకు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ చాలా ముఖ్యమైన వ్యక్తి అని, అయితే వారితో కలిసి సినిమా చేయలేకపోతున్నందుకు తాను బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాక, ఈ సినిమా తాను చేయకపోయినా వారి నుంచి ఎప్పటిలాగే గైడెన్స్ స్వీకరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
Harmanpreet Kaur: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే?
రజినీకాంత్ కెరీర్‌లో ఇది 173వ సినిమాగా రూపొందాల్సి ఉంది. అయితే, సుందర్ సి దర్శకత్వంలో సినిమా వస్తుంది అనగానే, ఫ్యాన్స్ అందరూ ఒకప్పటి వింటేజ్ రజినీకాంత్ కామెడీ చూడవచ్చని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి సుందర్ సి దర్శకత్వం నుంచి తప్పుకోవడంతో, ఎవరు డైరెక్ట్ చేస్తారని చర్చ మొదలైంది.