Sukesh Chandrasekhar: హెలికాప్టర్ కొనిస్తా ఐ లవ్ యూ.. జైలు గోడల మధ్య నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ ‘ఖరీదైన’ ప్రేమ లేఖ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukesh Chandrasekhar: ఢిల్లీలోని మండోలి జైలు గోడల మధ్య నుంచి బయటికి వచ్చిన ఒక ‘ప్రేమ లేఖ’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్, ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ప్రేమఖైదీ తన లవ్ లెటర్‌లో ఏం రాశాడో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Maha Shivaratri 2026: మహా శివరాత్రి పురాణం.. శుభ గడియాలు.. అభిషేకాలు, పూజలకు అనుకూల సమయం ఏంటి..?
Also Read
- Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
- BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
- CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
సుకేష్ జైలులో ఉండి కూడా జాక్వెలిన్‌పై తన ‘ఖరీదైన’ ప్రేమను చాటుకున్నాడు. ఆయన రాసిన ప్రేమ లేఖలో జాక్వెలిన్‌ను ‘బొమ్మా’, ‘ఏంజెల్’, ‘జాకీ’ అని ముద్దుగా పిలుస్తూ, ఆమెకు ఎయిర్ బస్ H-సిరీస్ హెలికాప్టర్ బహుమతిగా ఇస్తాన్నారు. ఆ హెలికాప్టర్ మీద ఆమె పేరులోని మొదటి అక్షరాలు ‘JF’ అని రాసి ఉంటాయని, ఆమె దగ్గరున్న ప్రైవేట్ జెట్, యాచ్ (విలాసవంతమైన పడవ) రంగులోనే దీనికి కూడా పెయింట్ చేయిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇది అక్రమ సొమ్ముతో కాకుండా, తన కష్టార్జితంతో కొంటున్నానని లేఖలో చెప్పుకొచ్చాడు.
సుకేష్ తన లేఖలో భావోద్వేగాలను కుమ్మరించాడు. తమ ప్రేమకథను ప్రపంచ ప్రసిద్ధ జంటలైన రోమియో-జూలియట్, హీర్-రంజా, లైలా-మజ్నులతో పోల్చాడు. జైలు గోడలు మమ్మల్ని విడదీసినా, నా గుండె చప్పుడులో ఆమె పేరే వినిపిస్తుంది అంటూ రాసుకొచ్చాడు. ఆమె ఎదుర్కొంటున్న కష్టాలకు, ఒత్తిడికి తనే బాధ్యత వహిస్తున్నానని, త్వరలోనే అన్ని సమస్యలు సర్దుమణిగి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. “ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నిన్ను వదలను.. నువ్వు నా ఒక్కదానివే” అంటూ రాసుకొచ్చాడు. నిజానికి సుకేష్ ఇలాంటి వింత లేఖలు రాయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా వాలెంటైన్స్ డే, క్రిస్మస్, నవరాత్రి, ఆమె పుట్టినరోజున ఇలాంటి ప్రకటనలే చేశాడు. గత ఏడాది జాక్వెలిన్ కోసం కస్టమైజ్డ్ గల్ఫ్‌స్ట్రీమ్ ప్రైవేట్ జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పాడు. విలాసవంతమైన పెంట్‌హౌస్‌లు, లగ్జరీ కార్లు, ద్రాక్ష తోటలు ఇస్తానని కూడా గతంలో చెప్పుకోచ్చాడు.
జాక్వెలిన్ ఏమంటోందంటే..
సుకేష్ ఇన్ని లేఖలు రాస్తున్నా, జాక్వెలిన్ వైఖరి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. తనకి అతనితో ఎలాంటి సంబంధం లేదని, అతను చెప్పే ఖరీదైన బహుమతుల గురించి తనకు ఏమీ తెలియదని ఆమె ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా పేర్కొంది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్, మోసం కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి.
READ ALSO: Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
తాజావార్తలు
-
Shehbaz Sharif: భారత్‌పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
-
Nepal Gorkhas: “మేము భారత సైన్యంలో చేరుతాం”.. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!