Site icon NTV Telugu

Sukesh Chandrasekhar: హెలికాప్టర్ కొనిస్తా ఐ లవ్ యూ.. జైలు గోడల మధ్య నుంచి జాక్వెలిన్‌కు సుకేశ్ ‘ఖరీదైన’ ప్రేమ లేఖ!

Sukesh Chandrasekhar

Sukesh Chandrasekhar

Sukesh Chandrasekhar: ఢిల్లీలోని మండోలి జైలు గోడల మధ్య నుంచి బయటికి వచ్చిన ఒక ‘ప్రేమ లేఖ’ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్, ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ ప్రేమఖైదీ తన లవ్ లెటర్‌లో ఏం రాశాడో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Maha Shivaratri 2026: మహా శివరాత్రి పురాణం.. శుభ గడియాలు.. అభిషేకాలు, పూజలకు అనుకూల సమయం ఏంటి..?

సుకేష్ జైలులో ఉండి కూడా జాక్వెలిన్‌పై తన ‘ఖరీదైన’ ప్రేమను చాటుకున్నాడు. ఆయన రాసిన ప్రేమ లేఖలో జాక్వెలిన్‌ను ‘బొమ్మా’, ‘ఏంజెల్’, ‘జాకీ’ అని ముద్దుగా పిలుస్తూ, ఆమెకు ఎయిర్ బస్ H-సిరీస్ హెలికాప్టర్ బహుమతిగా ఇస్తాన్నారు. ఆ హెలికాప్టర్ మీద ఆమె పేరులోని మొదటి అక్షరాలు ‘JF’ అని రాసి ఉంటాయని, ఆమె దగ్గరున్న ప్రైవేట్ జెట్, యాచ్ (విలాసవంతమైన పడవ) రంగులోనే దీనికి కూడా పెయింట్ చేయిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇది అక్రమ సొమ్ముతో కాకుండా, తన కష్టార్జితంతో కొంటున్నానని లేఖలో చెప్పుకొచ్చాడు.

సుకేష్ తన లేఖలో భావోద్వేగాలను కుమ్మరించాడు. తమ ప్రేమకథను ప్రపంచ ప్రసిద్ధ జంటలైన రోమియో-జూలియట్, హీర్-రంజా, లైలా-మజ్నులతో పోల్చాడు. జైలు గోడలు మమ్మల్ని విడదీసినా, నా గుండె చప్పుడులో ఆమె పేరే వినిపిస్తుంది అంటూ రాసుకొచ్చాడు. ఆమె ఎదుర్కొంటున్న కష్టాలకు, ఒత్తిడికి తనే బాధ్యత వహిస్తున్నానని, త్వరలోనే అన్ని సమస్యలు సర్దుమణిగి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. “ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నిన్ను వదలను.. నువ్వు నా ఒక్కదానివే” అంటూ రాసుకొచ్చాడు. నిజానికి సుకేష్ ఇలాంటి వింత లేఖలు రాయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా వాలెంటైన్స్ డే, క్రిస్మస్, నవరాత్రి, ఆమె పుట్టినరోజున ఇలాంటి ప్రకటనలే చేశాడు. గత ఏడాది జాక్వెలిన్ కోసం కస్టమైజ్డ్ గల్ఫ్‌స్ట్రీమ్ ప్రైవేట్ జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పాడు. విలాసవంతమైన పెంట్‌హౌస్‌లు, లగ్జరీ కార్లు, ద్రాక్ష తోటలు ఇస్తానని కూడా గతంలో చెప్పుకోచ్చాడు.

జాక్వెలిన్ ఏమంటోందంటే..
సుకేష్ ఇన్ని లేఖలు రాస్తున్నా, జాక్వెలిన్ వైఖరి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. తనకి అతనితో ఎలాంటి సంబంధం లేదని, అతను చెప్పే ఖరీదైన బహుమతుల గురించి తనకు ఏమీ తెలియదని ఆమె ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా పేర్కొంది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్, మోసం కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ప్రధాన నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి.

READ ALSO: Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!

Exit mobile version