Group-2 Student: హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్ లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళికగా గుర్తించారు. బయటకు వెళ్లిన స్నేహితులు తిరిగి వచ్చి చూసే సరికి గదిలో ఉరి వేసుకుని ఉండడంతో హాస్టల్ మేనేజర్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి జీవితాలతో ఆడుకుంటోందని నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కిందకు చేరుకుని నిరసన తెలిపారు. పదేళ్లు గడుస్తున్నా గ్రూప్ పరీక్షలు నిర్వహించకపోవడంతో ఇప్పుడు మరోసారి వాయిదా వేయడంతో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
ప్రవళిక సూసైడ్ నోట్
ఆత్మహత్యకు ముందు ప్రవిలిక రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ‘అమ్మా నన్ను క్షమించు.. నేను ఓడిపోయాను, నా వల్ల నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నావు. ఏడవకండి జాగ్రత్తగా ఉండండి. నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం.. నన్ను చూసుకున్నారు. కానీ నేను నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను ఎవరూ క్షమించరు.. అమ్మా.. నాన్న జాగ్రత్త’ అని రాసింది. ప్రవళిక ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం తండ్రి లింగయ్య అని మాత్రమే సమాచారం, మిగిలిన కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రవళిక మృతి చెందిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల హాస్టళ్ల విద్యార్థులు.. ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ప్రవళిక మృతదేహానికి నేడు అంత్యక్రియల అనంతరం ప్రవళిక మృతదేహాన్ని వరంగల్ కు తరలించినట్లు సమాచారం.
Group-2 Student: కన్నీరుపెట్టిస్తున్న.. గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక సూసైడ్ లెటర్